పీకే ఎగ్జిట్ అయితే టైగర్ దిగిపోతుందా?
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. ఇక పదవిలో ఉన్నంత కాలం ప్రజలకు ఇచ్చిన హామీలపై పనిచేయాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. ఇక పదవిలో ఉన్నంత కాలం ప్రజలకు ఇచ్చిన హామీలపై పనిచేయాల్సి ఉంది. ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నింటిని నేరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఎంత ఉందో? పవన్ పై కూడా అంతే ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తారని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ హామీలీతో పాటు సినిమాలు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా నెత్తిన ఉంది.
ఇప్పటికే ఆయన సెట్స్ కి ఎప్పుడు వస్తాడా? అని దర్శక-నిర్మాతలు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. షూటింగ్ లు బాగా డిలే అవ్వడంతో త్వరగా సెట్స్ కి రావాలని కోరుకుంటున్నారు. కానీ పవన్ సెట్స్ కి వెళ్లేది ఎప్పుడు? అన్న దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే సెప్టెంబర్ 27న `ఓజీ` రిలీజ్ చేస్తామని ప్రేక్షకాభిమానులకు ప్రామిస్ చేసారు. కానీ పీకే బిజీ షెడ్యూల్ చూస్తుంటే సెప్టెంబర్ లో సాధ్యమేనా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
పవన్ డేట్లు కేటాయించి వీలైనంత వేగంగా షూట్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తే తప్ప రిలీజ్ సాధ్యం కాదు. అయితే ఓజీ గనుక వాయిదా పడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తేదికి ల్యాండ్ అయిపోవాలని చూస్తున్నారుట. ప్రస్తుతం ఆయన కథానయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సమ్మర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన దేవర షూట్ కారణంగానే అక్టోబర్ కి వాయిదా వేసారు. అప్పటి నుంచి వేగంగానే షూటింగ్ నిర్వహించారు.
ఎన్టీఆర్ డేట్లు పర్పెక్ట్ గా ప్లాన్ చేసుకోవడంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా జరిగింది. దీంతో అక్టోబర్ కంటే ముందుగానే వస్తే బాగుంటుంది? అన్న ఆలోచన చిత్ర వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో `ఓజీ` అప్ డేట్ పై ఆరా తీస్తే పవన్ బిజీ, పెండింగ్ షూటింగ్ చూస్తే రిలీజ్ కష్టమే అన్న సంకేతాలు దేవరకి అందాయట. ఈ నేపథ్యంలో ఆ తేదీపై దేవర నిర్మాతలు కన్నేసినట్లు ప్రచారం సాగుతోంది.