దేవర.. తొందర పడొద్దంటున్న అభిమానులు..!

ఫస్ట్ గ్లింప్స్ తో అంచనాలను డబుల్ ట్రిపుల్ చేసిన దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ కంగారు మొదలైంది.

Update: 2024-01-15 15:30 GMT

ఫస్ట్ గ్లింప్స్ తో అంచనాలను డబుల్ ట్రిపుల్ చేసిన దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ కంగారు మొదలైంది. దేవర మొదలు పెట్టి ఏడాది అవుతున్నా కూడా రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఏప్రిల్ కల్లా రిలీజ్ చేయాలని స్పీడ్ గా చుట్టేస్తున్నారా అన్న డౌట్ మొదలైంది. ఎందుకంటే కొరటాల శివ పై ఆచార్య ముందు వరకు ఎలాంటి డౌట్లు లేవు కానీ మెగా ఆచార్య డిజాస్టర్ కి కారణాలు ఏవైనా సరే అన్ని వేళ్లు కొరటాల శివ వైపే తప్పు చూపించాయి. అఫ్కోర్స్ సినిమా హిట్ కి కారణాలు ఎన్నో చెబుతారు కానీ ఫ్లాప్ అయితే మాత్రం అది డైరెక్టర్ ఒక్కడి తప్పే అంటారు.

ఆచార్య ఫ్లాప్ తాలూకా విషయాలను మర్చిపోయి దేవర మొదలు పెట్టాడు కొరటాల శివ. వరల్డ్ వైడ్ గా ఉన్న తారక్ ఫ్యాన్స్ అందరికీ దేవరతో మరో సెన్సేషనల్ హిట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మొదలైన కొన్నాళ్లకే సినిమా క్యారెక్టరైజేషన్ స్క్రీన్ ప్లే బాగా వస్తుండటం వల్ల రెండు భాగాలుగా తీయాలని ఫిక్స్ అయ్యారు. దేవర 1 ఏప్రిల్ 5కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే స్టార్ సినిమాలు అనుకున్న డేట్ కి రావడం కష్టమే ముఖ్యంగా సినిమాపై ఉన్న అంచనాలను అందుకునేలా బెస్ట్ టైమింగ్.. బెస్ట్ మూమెంట్ కోసం ఎదురుచూస్తారు.

అంతేకాదు సినిమా రిలీజ్ ముందే ప్రచార చిత్రాలతో సినిమాపై బజ్ ఇంకాస్త పెంచుతారు. దేవర విషయంలో ఇవన్నీ కొరటాల ఎలా ప్లాన్ చేశారన్నది ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి కన్ ఫ్యూజన్ గా ఉంది. దేవర రిలీజ్ వాయిదా పడినా పర్లేదు కానీ అనుకున్న టార్గెట్ మాత్రం రీచ్ అయ్యేలా కొరటాల శివ తెరకెక్కించాలని అంటున్నారు. ఈమధ్య స్టార్ సినిమాలు ఫ్యాన్స్ ఊహించేది ఒకటైతే రిజల్ట్ మరోలా ఉంటుంది.

దేవర గ్లింప్స్ తో ఫ్యాన్స్ అంతా ఈసారి గట్టిగా కొడుతున్నామని అనుకున్నా ఎక్కడో ఒక మూల డౌట్ కూడా ఉంది. అందుకే ఏప్రిల్ 5 ఎలాగైనా రిలీజ్ చేయాలనే తొందర కాకుండా సినిమా అనుకున్న విధంగా వస్తుందా లేదా అన్నది చూసుకుని వదిలితే బెటర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ ఏర్పడుతుంది. ఆ బజ్ కి తగినట్టుగా సినిమా ఉంటే మాత్రం ఎన్.టి.ఆర్ దేవర రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ గా మారడం పక్కా అని చెప్పొచ్చు.

Tags:    

Similar News