పుష్ప 2: ఆ సీన్స్ పై దేవి ఏమన్నాడంటే..

రీసెంట్ గా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో ఫ్యాన్స్ లో మరింత అంచనాలను పెంచాడు.

Update: 2024-10-14 16:40 GMT

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఈ బిసినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యికోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. అలాగే చిత్ర యూనిట్ సభ్యులు కూడా అదే దిశగా సినిమాను ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

ఇక త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న డేట్ మిస్సవ్వకూడదని, అనుకున్నట్లే సినిమా ప్రమోషన్స్ కూడా కొనసాగాలని సుకుమార్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అప్పుడప్పుడు జనాల్లో వైరల్ అయ్యే విధంగా మేకర్స్ తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నీ కావు.

రీసెంట్ గా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో ఫ్యాన్స్ లో మరింత అంచనాలను పెంచాడు. ఈ సినిమాలో ఫస్ట్ అఫ్ ఇప్పటికే తాను చంద్రబోస్ గారు చూసామంటూ ఫస్టాఫ్ చూసిన తర్వాత అందులో ఒక మూడు బ్లాక్స్ చూసిన తర్వాత అద్భుతంగా ఉన్నాయి అనిపించింది. అంతే కాకుండా మధ్య మధ్యలో మేము అప్పుడే ఇంటర్వెల్ అని అనుకున్నాము.

ఆ విధంగా దర్శకుడు తన రచనతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు అని దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా బన్నీ కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు అంటూ ఇద్దరి కాంబినేషన్లో మరొకసారి మ్యాజిక్ జరగడం పక్కా అని అన్నారు. ఇక దేవి ఈ సినిమాకు స్వరపరిచిన పాటలు ఇప్పటికే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.

ఇక త్వరలోనే మరొక సాంగ్ కూడా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఈ సినిమా బిజినెస్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక సినిమా ట్రైలర్ ను కూడా ఒక భారీ ఈవెంట్ ద్వారా విడుదల చేయడానికి ప్రణాళికలుగా రచిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ జనాల దృష్టిని మరింత ఆకర్షించే విధంగా ముంబైలోనే ఆ ఈవెంట్ నిర్వహించాలని కూడా నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News