ఆరెంజ్ డ్రెస్సులో దేవియాని.. వ్వాటే స్టన్నింగ్ లుక్!

ఆమె ధరించిన పఫ్ స్లీవ్ డ్రెస్ పర్ఫెక్ట్ ఫిట్ గా ఉండటం, అందులో ఆమె కన్ఫిడెన్స్ హైలైట్ అవ్వడం ఈ ఫోటోలకి స్పెషలిటీ.

Update: 2025-01-24 02:30 GMT

సోషల్ మీడియాలో తన అందంతో పాటు ఫ్యాషన్ ట్రెండ్ ను అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న దేవియాని శర్మ తన లేటెస్ట్ ఫోటోలతో మళ్ళీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. తాజాగా దేవియాని శర్మ ఒక ఆరెంజ్ కలర్ గ్లామర్ డ్రెస్సులో ఫోటోషూట్ చేయించి తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ని మరోసారి చాటిచెప్పారు. ప్రకృతి అందాల నడుమ ఆమె ఈ డ్రెస్సులో మెరిసిపోవడం గమనార్హం.

 

ఈ ఫోటోలలో దేవియాని తన ఆరెంజ్ డ్రెస్ తో ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త లుక్ లా కనిపించారు. ఆమె ధరించిన పఫ్ స్లీవ్ డ్రెస్ పర్ఫెక్ట్ ఫిట్ గా ఉండటం, అందులో ఆమె కన్ఫిడెన్స్ హైలైట్ అవ్వడం ఈ ఫోటోలకి స్పెషలిటీ. ఆమె జుట్టును సింపుల్ గా స్ట్రెయిట్ చేసుకుని, నేచురల్ లుక్ తో ఈ ఫోటోలలో దేవియాని మరింత అందంగా కనిపించారు.

 

గతంలో మోడల్ గా కెరీర్ ఆరంభించిన దేవియాని, తన వెబ్ సిరీస్ ప్రాజెక్టులతో మంచి గుర్తింపు పొందింది. ప్రత్యేకించి "అనగనగా," "సైతాన్" లాంటి సిరీస్ లలో తన నటనా నైపుణ్యాన్ని చూపించి ఫ్యాన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకుంది. ప్రస్తుతం దేవియాని "లైఫ్ స్టోరీస్" అనే మరో వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఫ్యాషన్ విషయంలో దేవియాని తనదైన ట్రెండ్ ని కొనసాగిస్తున్నారు. ఆమె ఎంచుకునే డ్రెస్సులు, ఫోటోషూట్ లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

ముఖ్యంగా ఈ ఆరెంజ్ డ్రెస్సులో ఆమె అందం నెటిజన్లకు మరింత దగ్గరయ్యేలా చేసింది. ఈ ఫోటోలతో పాటు దేవియాని ఇచ్చిన "ఫినైట్ డిసప్పాయింట్‌మెంట్‌ ని అంగీకరించాలి, కానీ ఇన్ఫినైట్ హోప్ ని కోల్పోవద్దు" అనే క్యాప్షన్ ఆమె ఆలోచనా ధోరణిని హైలైట్ చేస్తుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆమె గ్లామర్ పిక్స్ చూసిన నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ తో స్పందిస్తున్నారు.

Tags:    

Similar News