డెవిల్ గొడవ.. బిజినెస్ ను దెబ్బేసేలా ఉందే?
ఇక ఎంతకీ గొడవ ఒక కొలిక్కి రాకపోవడంతో బాధపడ్డ దర్శకుడు నవీన్ తన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ చట్టపరమైన అడ్డంకులు ఖచ్చితంగా సినిమాకు ప్రతికూల అంశం కావచ్చు.
నందమూరి కళ్యాణ్ రామ్ 2022లో బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద కెరీర్ బిగ్గెస్ట్ సక్సెస్ చూశాడు. అయితే ఆ తరువాత వచ్చిన అమిగోస్ మాత్రం దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో అతను ఆశలన్నీ డెవిల్ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోని మళ్ళీ ట్రాక్ రావాలని అనుకున్నాడు. కానీ ఏమైందో ఏమో గాని సెట్స్ పైకి వెళ్లిన కొంత కాలానికే సినిమాను అనేక వివాదాలు వెంటాడుతూ వస్తున్నాయి.
ముఖ్యంగా పోస్టర్‌లో ఉన్న దర్శకుడి పేరును టీమ్ తొలగించడంతో సినిమా వివాదంలో పడిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటివరకు ఒక కొలిక్కి రాకపోగా మరో స్థాయికి చేరుకుంది. మొదట నవీన్ మేడారం దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. కానీ మేకింగ్ విషయంలో కొన్ని విభేదాల కారణంగా చిత్ర బృందం అతని పేరును తొలగించింది.
అంతే కాకుండా చిత్ర నిర్మాత అభిషేక్ నామా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు క్రెడిట్‌ను తీసుకున్నారు. ఇది అందరిని ఆశ్చర్యంలో పడేసింది. అయితే ఆ వివాదం విషయంలో దర్శకుడు హార్ట్ అయ్యి సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ కూడా పెట్టాడు. కానీ ఎవరూ కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. హీరో కళ్యాణ్ రామ్ కూడా ఆ విషయంలో మౌనంగా ఎందుకు ఉన్నాడు అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు.
ఇక ఎంతకీ గొడవ ఒక కొలిక్కి రాకపోవడంతో బాధపడ్డ దర్శకుడు నవీన్ తన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ చట్టపరమైన అడ్డంకులు ఖచ్చితంగా సినిమాకు ప్రతికూల అంశం కావచ్చు. అదే సమయంలో సినిమాకు మరో చిక్కు వచ్చిపడింది. టాక్ ప్రకారం, థియేట్రికల్ బిజినెస్ విషయంలో నిర్మాతకు ఇబ్బంది పడుతున్నట్లు టాక్ వస్తోంది.
సినిమా షూటింగ్ ఇంకా ముగియాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సమయానికి, థియేట్రికల్ బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అవ్వాలి, కానీ వివాదం కారణంగా సినిమా చుట్టూ ఉన్న పేలవమైన బజ్ సినిమాకు అడ్డంకిగా మిగిలిపోయింది. దీంతో సినిమాపై పెట్టుబడులు పెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్స్ వెనుకడుగు వేస్తున్నారు. మరి ఈ వివాదం విషయంలో కళ్యాణ్ రామ్ ఏదో ఒక విధంగా మాట్లాడి సాల్వ్ చేసుకుంటే బెటర్ అనే అభిప్రాయాలు వస్తున్నాయి. మరి ఆ విషయంలో హీరో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.