ఫ్యాన్స్ కోరుకున్నట్లే రామ్ చరణ్ హంగామా
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనున్నారు.
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనున్నారు. తెలుగమ్మాయి అంజలి కీలక పాత్రలో సందడి చేయనున్నారు.
భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్.. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో జనవరి 10వ తేదీన విడుదల అవ్వనుంది. అయితే ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మేకర్స్.. తాజాగా అమెరికాలోని డల్లాస్ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
అయితే ఈవెంట్ కు అభిమానులు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామ్ చరణ్.. వేదికకు వద్దకు వస్తున్న సమయంలో ఓ రేంజ్ లో సందడి చేశారు. గ్లోబల్ స్టార్ అంటూ నినాదాలు చేసి ఆడిటోరియాన్ని హోరెత్తించారు. ఆ తర్వాత వేడుకలో భాగంగా చరణ్.. రా మచ్చా మచ్చా సాంగ్ కు కాసేపు చిందులు వేశారు.
అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే కదా మాకు కావాల్సింది అంటూ మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. చరణ్ అన్న అదరగొట్టేశారని చెబుతున్నారు. తమ సోషల్ మీడియా వాల్స్ లో షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మూవీ కోసం వెయిటింగ్ అని చెబుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. యంగ్ ఐపీఎస్ అధికారి రామ్ నందన్ తోపాటు తండ్రి అప్పన్న రోల్స్ లో కనిపించనున్నారు. కియారా, అంజలితోపాటు ఎస్ జే సూర్య, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్, నాజర్ సహ పలువురు ప్రముఖ నటీనటులు మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన నాలుగు పాటలు కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. వేరే లెవెల్ లో రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు అంతా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి జనవరి 10న రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.