గేమ్ ఛేంజర్ 'డోప్'.. చరణ్, కియారా స్టెప్పులు వేరే లెవెల్!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

Update: 2024-12-22 06:22 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి జంటగా గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

అయితే సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన జరగండి జరగండి, రా మచ్చా మచ్చా రా, నా నా హైరానా సాంగ్స్ ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చార్ట్ బస్టర్స్ గా నిలిచిన ఆ పాటలు.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అంతలా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుని.. నెట్టింట దూసుకుపోతున్నాయి.

రీసెంట్ గా ఫోర్త్ సింగిల్ డోప్ చిన్న ప్రోమోను రిలీజ్ చేసిన మేకర్స్.. ఆడియన్స్ లో సాంగ్ పై భారీ హైప్ క్రియేట్ చేశారు. మూవీ టీమ్ సహా పలువురు ప్రముఖులు పాట అదిరిపోనుందని చెప్పి అంచనాలు పెంచారు. అయితే ఆ హైప్ కు తగ్గట్లే డోప్ లిరికల్ సాంగ్ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఓ రేంజ్ లో అందరినీ మెప్పిస్తూ సందడి చేస్తోంది.

అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డోప్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాణీలు కట్టగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. తమన్, రోషిణి జేకేవీ, పృథ్వీ, శృతి రంజని ఆలపించారు. అయితే డోప్ సాంగ్ ను రిపీటెడ్ మోడ్ లో వింటున్నామని చెబుతున్నారు నెటిజన్లు.

రామ్ చరణ్- కియారా స్టెప్పులు, తమన్ బీట్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, శంకర్ విజన్.. అలా అన్నీ వేరే లెవెల్ లో ఉన్నాయని చెబుతున్నారు. డ్యాన్స్ విషయంలో చరణ్ గ్రేస్ ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. తమన్ తన కెరీర్ లోనే బెస్ట్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మార్క్ క్లియర్ గా తెలుస్తోంది.

డైరెక్టర్ శంకర్.. సాంగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఆయన థీమ్స్ ఎప్పుడూ అదిరిపోతాయి. ఇప్పుడు డోప్ కోసం కూడా కేక పుట్టించే సెట్ వేసినట్లు అర్థమవుతోంది. అలా డోప్ సాంగ్ కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డట్లు తెలుస్తోందని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు. రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చేసిన డోప్ సాంగ్.. భారీ హిట్ అవ్వడం పక్కాలా ఉంది.

Full View
Tags:    

Similar News