మీడియాపై స్టార్ హీరో పంచ్ న‌షాలానికి

ఇటీవ‌ల సినీప‌రిశ్ర‌మ‌లు కూడా ప్ర‌పంచ మార్కెట్ ని కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నంలో ఉన్నాయి.

Update: 2024-12-22 06:24 GMT

ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో ఎవ‌రు ఎప్పుడు ఎక్క‌డ అయినా త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకోవ‌చ్చు.. కొనుగోలు చేయొచ్చు. గ్లోబ‌ల్ మార్కెట్‌ని చేరుకోవాల‌ని అన్ని ప‌రిశ్ర‌మ‌లు టార్గెట్ చేస్తున్నాయి. ఇటీవ‌ల సినీప‌రిశ్ర‌మ‌లు కూడా ప్ర‌పంచ మార్కెట్ ని కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నంలో ఉన్నాయి. పాన్ ఇండియన్ సినిమా .. పాన్ వ‌ర‌ల్డ్ సినిమా గురించి బోలెడంత చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఇంకా స్థానిక‌త (నేటివిటీ) ఫీలింగ్ ని చూపించ‌డం లేదా స్థానిక భాష‌లోనే సినిమా టైటిళ్లు ఉండాల‌నుకోవ‌డం విడ్డూరం కాదంటారా?

కార‌ణం ఏదైనా అలాంటి ప్ర‌శ్న సంధించిన మీడియాకు త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించారు కిచ్చా సుదీప్. రాజ‌మౌళి ఈగ చిత్రంలో న‌టించిన కిచ్చా, మెగాస్టార్ చిరంజీవి 'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రంలోను కీల‌క పాత్ర‌ను పోషించారు. ఇటీవ‌ల తెలుగు సినిమాల్లో న‌టించ‌క‌పోయినా కానీ, అత‌డికి ఇక్క‌డ అభిమానుల సంఖ్య ఎక్కువే.

ప్ర‌స్తుతం కిచ్చా త‌న సినిమా మ్యాక్స్ ను ప్ర‌మోట్ చేస్తున్నారు. ఈ సినిమాని క‌న్న‌డం స‌హా ఇరుగు పొరుగు భాష‌ల్లోను రిలీజ్ చేయాల‌నేది అతడి ప్లాన్. తాజాగా మీడియాతో ఇంటరాక్షన్ సమయంలో ఒక జర్నలిస్ట్ ''మీ చిత్రానికి ఇంగ్లీష్ టైటిల్‌కు బదులుగా కన్నడ టైటిల్‌ను ఎందుకు ఉపయోగించకూడదు?'' అని ప్ర‌శ్నించారు. దానికి ఎలాంటి సంకోచం లేకుండా వెంట‌నే జ‌వాబిచ్చారు సుదీప్. ''వీక్షకులు, ఇంటర్వ్యూ చేసేవారు కన్నడిగులే అయితే ఇక్కడ అన్ని న్యూస్ ఛానెల్‌ల పేర్లు ఇంగ్లీష్‌లో ఎందుకు ఉన్నాయి? నువ్వు కన్నడిగవు.. నేను కన్నడిగను..క‌దా! అని అన్నారు. చాలా మంది పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న విష‌యాన్ని మీడియాకు గుర్తు చేసారు. మీకు ఆపిల్ కావాలంటే, కన్నడలో ఎలా అడుగుతారు? అని కూడా కిచ్చా ప్రశ్నించారు. నిజానికి సుదీప్ ప్ర‌శ్న‌ల‌కు మీడియా ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. ప్ర‌స్తుతం ఈ ఇంట‌ర్వ్యూ విజువ‌ల్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

త‌మిళ తంబీల‌కు స్థానిక‌త పిచ్చి. దాని ప‌ర్య‌వ‌సానంగా ఇప్ప‌టికీ పాన్ ఇండియ‌న్ సినిమాలు తీయ‌లేని ధైన్యంలో ఉన్నారు. చెన్నై ప‌రిశ్ర‌మలో పెద్ద తోపులాంటి స్టార్లు ఉన్నా వారి నుంచి లోక‌ల్ సినిమాలు మాత్ర‌మే వ‌స్తున్నాయి. అయితే క‌న్న‌డ‌లో ప్ర‌శాంత్ నీల్ లాంటి ద‌ర్శ‌కులు స‌రిహ‌ద్దుల‌ను దాటి వెళ్లే సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2, స‌లార్ లాంటి పాన్ ఇండియ‌న్ చిత్రాల‌తో స‌త్తా చాటారు. ఈ సినిమాల‌న్నిటికీ ఇంగ్లీష్ టైటిళ్ల‌ను ఎందుకు పెట్టారో కూడా క‌న్న‌డ‌ మీడియా గ‌మ‌నించాలి. కుంచించుకుపోయిన స్వ‌భావాల‌తో ఇంకా లోక‌ల్ మార్కెట్ కే అంకిత‌మైతే అది ఎవ‌రి త‌ప్పిదం? విస్తార‌మైన ఆలోచ‌న‌ల‌తో అన్ని మార్కెట్లు కావాల‌ని అనుకుంటే, దాని ప‌రిధి విస్త్ర‌తంగా మారుతుంది. ఇంకా ఆంగ్ల మాధ్య‌మంలో చ‌దువుకుంటూ స్థానిక భాష‌నే ప‌ట్టుకుని వేలాడాలా?

Tags:    

Similar News