దిల్ రాజు 'ఇరుకు' డైలాగ్ తో చరణ్ కితకితలు
'పుష్ప 2' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని పాన్ ఇండియా స్థాయిలో అందుకున్న సుకుమార్ 'గేమ్ చేంజర్' బాగుంటుందని చెప్పడంతో ఫ్యాన్స్ కి ఈ మూవీపై కాన్ఫిడెన్స్ పెరిగింది.
'గేమ్ చేంజర్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి మూవీ టీమ్ మొత్తం అటెండ్ అయినట్లు తెలుస్తోంది. చీఫ్ గెస్ట్ గా సుకుమార్ ఈ ఈవెంట్ లో పాల్గొని 'గేమ్ చేంజర్' సినిమాకి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అని తెలిపారు. 'పుష్ప 2' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని పాన్ ఇండియా స్థాయిలో అందుకున్న సుకుమార్ 'గేమ్ చేంజర్' బాగుంటుందని చెప్పడంతో ఫ్యాన్స్ కి ఈ మూవీపై కాన్ఫిడెన్స్ పెరిగింది.
నెక్స్ట్ జనవరి 10 లోపు చేయబోయే మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ తో సినిమాకి మరింత బూస్టింగ్ వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మాటలతో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చారు. అలాగే ఫ్యాన్స్ ని ఉత్సాహపరచడానికి ఈ సినిమాలోని రా మచ్చా మచ్చా సాంగ్ కి స్టెప్పులు వేశారు.
ఇక ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రేక్షకులకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని అన్నారు. గతంలో విజయ్ 'వారిసు' మూవీ ప్రమోషన్స్ లో దిల్ రాజు చెన్నై లో తమిళ్, తెలుగు మిక్స్ చేసి మాట్లాడారు. ఆ మాటలు ఎంత వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ కూడా దిల్ రాజుని కాస్తా ఆటపట్టిస్తూ ఫైట్స్ వేనమా ఫైట్స్ ఇరుకు, సాంగ్స్ వేనమా సాంగ్స్ ఇరుకు అంతేనా సర్ అంటూ సరదాగా అడిగారు.
దిల్ రాజు రామ్ చరణ్ దగ్గరకొచ్చి ఆ డైలాగ్ ఏంటనేది చెప్పడంతో మీకు ఈ సినిమాలో ఎన్న వేనమా అన్ని ఇరుక్కు అంటూ తమిళ్ లో సరదాగా చెప్పారు. తరువాత దానిని కొనసాగిస్తూ సాంగ్స్, ఫైట్స్ అన్ని కూడా ఈ చిత్రంలో అద్భుతంగా ఉంటాయని అన్నారు. అలాగే ప్రతి సినిమాకి దిల్ రాజు గారు మార్కులు కొట్టేస్తూ ఉంటారు.
'గేమ్ చేంజర్' విషయంలో థమన్ మంచి సాంగ్స్ అందించి మార్కులు కొట్టేశాడని చరణ్ అన్నారు. అలాగే ఈ సినిమా అందరిని అలరిస్తుందని తెలియజేశాడు. రామ్ చరణ్ స్పీచ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన స్పీచ్ లో భాగంగా చరణ్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీ గురించి మాట్లాడారు. ఆ సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.