ఉ అంటావా సాంగ్.. పిచ్చి పట్టిందని అనుకోవద్దని దేవి నోట్..!
కొన్నిసార్లు సినిమాకు ఏది కరెక్ట్ అనేది దర్శకుడు మాత్రమే కాదు ఆ సినిమాకు పనిచేసే ఏ టెక్నిషియన్ అయినా చెప్పొచ్చు.
కొన్నిసార్లు సినిమాకు ఏది కరెక్ట్ అనేది దర్శకుడు మాత్రమే కాదు ఆ సినిమాకు పనిచేసే ఏ టెక్నిషియన్ అయినా చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమాకు పనిచే దర్శకుడు, సంగీత దర్శకుడు, కెమెరా మ్యాన్ వీరి మధ్య మంచి రిలేషన్ ఉంటే సినిమా అవుట్ పుట్ బాగా వస్తుంది. ఈ క్రమంలో పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు ఇది బాగా కుదిరింది కాబట్టే ఆ సినిమా ఆ రేంజ్ హిట్ అయ్యింది. పుష్ప సినిమాలో ఆన్ స్క్రీన్ పుష్ప రాజ్ అదేనండి అల్లు అర్జున్ చెలరేగిపోతే ఆఫ్ స్క్రీన్ క్రూ అంతా కలిసి అదరగొట్టారు.
పుష్ప సినిమాకు దేవి ఇచ్చిన ఆల్బం కూడా సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. సినిమాలో హైలెట్స్ లో దేవి మ్యూజిక్ కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ కాగా ఉ అంటావా సాంగ్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ సాంగ్ వెనక జరిగిన ఒక గమ్మత్తైన విషయాన్ని రీసెంట్ గా ప్రేక్షకులతో పంచుకున్నారు డిఎస్పి. సుకుమార్ పుష్ప లో ఒక స్పెషల్ ఐటం సాంగ్ కావాలని అడిగితే తను ఉ అంటావా సాంగ్ కంపోజ్ చేసి దర్శక నిర్మాతలకు పంపించాడట.
తను కంపోజ్ చేసిన ఈ సాంగ్ వాళ్లు కచ్చితంగా రిజట్ చేస్తారని ఆ కంపోజింగ్ తో పాటుగా ఒక చిన్న నోట్ కూడా పంపించాడట దేవి శ్రీ ప్రసాద్. మీరు ఆశించిన దానికి భిన్నంగా ఈ సాంగ్ పంపిస్తున్నాను. నాకు పిచ్చి పట్టిందని అనుకోవచ్చు. ఈ పాటని తిరస్కరించొచ్చు కూడా.. కానీ దయచేసి నన్ను నమ్మి సినిమాలో ఈ పాట పెట్టండి అంటూ ఐటెం సాంగ్స్ ని ఇది రీ డిఫైన్ చేస్తుందని దేవి నోట్ లో రాశడట.
అతను ఊహించినట్టుగానే ఐటెం సాంగ్ అంటే ఊపేయాలి కానీ ఇదేంటి ఇంత స్లోగా ఉందని అల్లు అర్జున్ సుకుమార్ అనుకున్నారట. 30 సెకన్ల తర్వాత సాంగ్ ఊపందుకుందని చెప్పారట. సో అలా ఉ అంటావా సాంగ్ సినిమాలోకి వచ్చిందని చెప్పారు. అయితే దేవి కంపోజింగ్ మాత్రమే కాదు స్క్రీన్ మీద సమంత పర్ఫార్మెన్స్ కూడా ఈ సాంగ్ హిట్ కావడానికి మరో రీజన్ అయ్యింది. దేవి సినిమా అంటే స్పెషల్ ఐటం సాంగ్ కంపల్సరీ ఆశిస్తారు. అయితే పుష్ప 1 లో ఐటం సాంగ్ తో కూడా ప్రయోగం చేసి శభాష్ అనిపించాడు మన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్