ఈ ఏడాది దేవి సౌండ్ గట్టిగానే..
ఇక ఖడ్గం, మన్మధుడు, వర్షంతో పాటు మరికొన్ని కమర్షియల్ హిట్స్ ను అందుకున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీకి ఆయన పరిచయమై 25 ఏళ్లు అవుతుంది. 1999లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవి’ సినిమాతో డీఎస్పీ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆనందం, కలుసుకోవాలని, సొంతం వంటి మూవీస్ తో మ్యూజికల్ లవర్స్ ను మెస్మరైజ్ చేశారు.
ఇక ఖడ్గం, మన్మధుడు, వర్షంతో పాటు మరికొన్ని కమర్షియల్ హిట్స్ ను అందుకున్నారు. అలా టాలీవుడ్ టాప్ మేకర్స్ దృష్టిలో పడ్డ దేవిశ్రీ.. తెలుగుతో పాటు కోలీవుడ్ చిత్రాలకు కూడా సంగీతం అందించారు. టాప్ హీరోలందరి సినిమాలకు బాణీలు కట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీకి ఇచ్చిన మ్యూజిక్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేశారు. సెలబ్రిటీల నుంచి కామన్ పీపుల్ వరకు అంతా పుష్ప పాటలకు చిందేసేలా చేశారు.
ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలకు సంగీతం అందిస్తూ.. మోస్ట్ సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా టాలీవుడ్ లో దేవిశ్రీ కొనసాగుతున్నారు. గత ఏడాది దేవిశ్రీ కంపోజ్ చేసిన ఒక్క మూవీ మాత్రమే రిలీజ్ అయింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు మ్యూజిక్ అందించిన డీఎస్పీ.. ఇప్పుడు 2024లో చేతి నిండా మూవీలతో బిజీ గా ఉన్నారు.
ఇటీవల పుష్ప -2 నుంచి రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. కుబేర మూవీ ఫస్ట్ లుక్ కూడా లాంఛ్ అవ్వడంతో దేవిశ్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. పుష్ప టైటిల్ సాంగ్.. ఇంటర్నెట్ ను ఒక ఊపు ఊపేస్తోంది. అన్ని భాషల్లో కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. డీఎస్పీ ఇచ్చిన ఫుల్ బీట్ తో సాంగ్ అదిరిపోయిందని అంతా అంటున్నారు.
ఇక కుబేర మూవీ కోసం ఫస్ట్ టైం డైరెక్టర్ శేఖర్ కమ్ములతో వర్క్ చేస్తున్నారు దేవిశ్రీ. నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు గాను ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు అక్కినేని నాగ చైతన్య తండేల్, రామ్ చరణ్ RC 17, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలకు కూడా డీఎస్పీ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి 2024 లో దేవిశ్రీ ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.