బ్లాక్ బికినీతో హీట్ పెంచేసిన దేవియాని
ప్రకృతి అందాల మధ్య ఆమె కూర్చుని దిగిన ఈ ఫోటోలు నెటిజన్లను కట్టిపడేసేలా ఉన్నాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో కొత్త ట్రెండ్‌లను సెట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరించే దేవియాని శర్మ తాజాగా తన బ్లాక్ బికినీ ఫోటోలను షేర్ చేసి స్టార్ హీరోయిన్స్ రేంజ్ వైరల్ అయ్యారు. "జంగిల్ క్వీన్" అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోలను పోస్ట్ చేసిన దేవియాని, తన సింప్లిసిటీతో పాటు క్లాసీ లుక్‌ను హైలైట్ చేశారు. ప్రకృతి అందాల మధ్య ఆమె కూర్చుని దిగిన ఈ ఫోటోలు నెటిజన్లను కట్టిపడేసేలా ఉన్నాయి.
ఈ ఫోటోల్లో దేవియాని తన బ్లాక్ అవుట్‌ఫిట్ బికినీ లో ఆకర్షణీయంగా కనిపిస్తూ, బ్యూటీ ఫ్యాక్టర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. బికినీ ఫోటోలు మాత్రమే కాకుండా, దేవియాని తన కాన్ఫిడెన్స్‌తో కూడా ఫాలోవర్స్‌ను ఆకర్షిస్తున్నాడు. నెటిజన్లు ఈ ఫోటోలపై పాజిటివ్ కామెంట్లు పెడుతుండటం గమనార్హం. ఫిట్‌నెస్, ఫ్యాషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు దేవియాని.
ఇంతకుముందు మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన దేవియాని, తెలుగు వెబ్ సిరీస్‌లతో తన టాలెంట్ ను చూపించింది. ఎలాంటి పాత్ర చేసినా కూడా అమ్మడు ఆ పాత్రలో డిఫరెంట్ గా కనిపించే ప్రయత్నం చేసింది. "అనగనగా," "సైతాన్," "సేవ్ ద టైగర్స్" వంటి సిరీస్‌లలో దేవియాని ప్రధాన పాత్రలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తన రాబోయే ప్రాజెక్ట్ "లైఫ్ స్టోరీస్" లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా దేవియాని తన నటనా ప్రతిభను మరింతగా ప్రదర్శించనున్నారు. దేవియాని తన ప్రత్యేకమైన గ్లామర్ ఫోటోషూట్‌లతో పాటు, ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను షేర్ చేస్తూ యువతకు ఓ ప్రేరణగా నిలుస్తున్నారు. బికినీ ఫోటోలు మాత్రమే కాకుండా, ఆమె టాలెంట్, వర్క్ ఎథిక్ ఆమెను ప్రత్యేకతను చూపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమ్మడి గ్లామరస్ లుక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ అందంతో అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.