తెరపైకి సంచలన దొంగ జీవిత కథ!
హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్, గ్రాఫాలజిస్టు.. ఇలా ఎన్నో అర్హతలు ఉన్నాయి.
దొంగలు చాలారకాలుగా ఉంటారు. వాళ్ళలో ధనీ రాం మిట్టల్ తీరే వేరు. పోలీసు రికార్డుల ప్రకారం అతనికి ‘సూపర్ నట్వర్‌లాల్’, ‘ఇండియన్ చార్లెస్ శోభరాజ్’ అని పేర్లు కూడా ఉన్నాయి. అతనో ఇంటెలిజెంట్ క్రిమినల్. లా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడని అంటుంటారు. హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్, గ్రాఫాలజిస్టు.. ఇలా ఎన్నో అర్హతలు ఉన్నాయి. భారతదేశంలోని అత్యంత తెలివైన నేరస్థుడిగా పేరుగాంచాడు.
మిట్టల్ చదువు సంధ్యలు అబ్బక అల్లరిచిల్లరిగా తిరిగి దొంగతనాలకు అలవాటు పడ్డాడనుకుంటే పొరపాటు. ఇతను లా డిగ్రీ చదివాడు. అంతేకాదు హ్యాండ్ రైటింగ్‌లో స్పెషలిస్ట్.. గ్రాఫాలజిస్ట్.. ఇలా ఎన్నో విద్యార్హతలున్న ధనిరామ్ మిట్టల్ దొంగతనాన్ని జీవనోపాధిగా ఎంచుకోవడం గమనార్హం. సుమారు ఆరు దశాబ్దాల కాలంలో రికార్డు స్థాయిలో అరెస్టు అవ్వటమే కాదు.. వెయ్యికి పైగా కార్లను దొంగతనం చేసిన రికార్డు కూడా సృష్టించాడు.
ప్రధానంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టపగలు కార్లను దొంగలించడంలో ఇతనను స్పెషాలిటీ. అంతే కాదు తప్పుడు పత్రాలను సృష్టించి అదనపు సెషన్స్ జడ్జి స్థానంలో జడ్జి అవతారమెత్తి 2 వేల మంది నేరస్తులను విడిపించిన ఘతన ఇతని సొంతం. ఏం జరుగుతుందో పోలీసులు తెలుసుకునే లోపు ఉడాయిస్తాడు. ఇలా ఎన్నో మోసపూరితక కేసులు మిట్టల్ మీద ఉన్నాయి.
తాజాగా ధని రాం మిట్టల్ జీవిత కథని మాలీవుడ్ దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించే బాధ్యత తీసుకున్నాడు. ప్రీతి అగర్వాల్ - చేతన్ ఉన్నియాల్ రచించిన `మనీరామ్` పుస్తకం ఆధారంగా ఈ చిత్రాం తెరకెక్కిస్తున్నారు. ప్రెట్టీ పిక్చర్స్‌తో కలిసి ఇన్‌సోమ్నియా మీడియా అండ్ కంటెంట్ సర్వీసెస్ సంయుక్తంగా నిర్మించడానికి ముందుకొచ్చాయి. దీన్ని హిందీలో తెరకెక్కిస్తున్నారు. అటుపై పాన్ ఇండియాలో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మిట్టల్ పాత్ర ఎవరు పోషిస్తారు? ఇతర తారాగాణం ఎవరు? అన్నది త్వరలో రివీల్ చేయనున్నారు.