దర్శకుడిగా మరో సీనియర్ కమెడియన్
ఇప్పుడు మరో కమెడియన్ కూడా దర్శకుడిగా మారబోతున్నాడు. కామిక్ క్యారెక్టర్స్ తో తనదైన గుర్తింపు క్రియేట్ చెస్క్షుకున్న ధనరాజ్ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమయ్యాడు.
ఈ మధ్య బలగం సినిమాతో కమెడియన్ వేణు దర్శకుడి అవతారం ఎత్తాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో మొదటి సినిమా చేసే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో రెండో మూవీని ఏకంగా స్టార్ హీరోతో చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో సెకండ్ మూవీని వేణు చేయనున్నాడు. కమెడియన్ గా పూర్తిస్థాయిలో ప్రూవ్ చేసుకునే పాత్రలు పడకపోవడంతో ఇటువైపుగా అతను టర్న్ అయ్యాడని చెప్పొచ్చు.
ఇప్పుడు మరో కమెడియన్ కూడా దర్శకుడిగా మారబోతున్నాడు. కామిక్ క్యారెక్టర్స్ తో తనదైన గుర్తింపు క్రియేట్ చెస్క్షుకున్న ధనరాజ్ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమయ్యాడు. కమెడియన్ గా సక్సెస్ అయిన తర్వాత నిర్మాతగా కూడా ధనరాజ్ రెండు సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. హీరోగా కూడా ప్రయత్నం చేశాడు. ఏవీ వర్క్ అవుట్ కాలేదు. జబర్దస్త్ కామెడీ రియాలిటీ షో నిలబడటంతో వేణు, ధనరాజ్ ఆరంభంలో పిల్లర్స్ గా నిలబడ్డారు.
వీరి నుంచి ఇప్పుడు స్టార్ కమెడియన్స్ గా ఉన్న చాలా మంది పరిచయం అయ్యారు. ధనరాజ్ కి చేతిలో చెప్పుకోదగ్గ సినిమా అవకాశాలు లేవు. దీంతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. ఏకంగా సముద్రఖనికి కథ చెప్పి ఒప్పించడంతో పాటు అతనే లీడ్ రోల్ లో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు.
సముద్రఖని లీడ్ రోల్ లో మూవీ అంటే కచ్చితంగా కంటెంట్ బేస్డ్ గానే ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. అక్టోబర్ 22 ఈ సినిమా ఓపెనింగ్ జరగబోతోందని తెలుస్తోంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందంట. బలగం సినిమాతో దర్శకుడిగా వేణు సక్సెస్ అయ్యి కమెడియన్ వేణు నుంచి బలగం వేణు అయిపోయాడు.
అలా ధనరాజ్ కూడా తన సినిమా పేరుని బ్రాండ్ నేమ్ గా మార్చుకునే అద్భుతమైన కథని అందించగలడా లేదా అనేది చూడాలి. ధనరాజ్ సక్సెస్ అయితే అతని దారిలో మరికొంత మంది కమెడియన్స్ కూడా దర్శకులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.