పది : ఏ హీరోకి దక్కని రికార్డ్
ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి అయిదు నుండి పది అంతకు మించి సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి
ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి అయిదు నుండి పది అంతకు మించి సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ విషయంలో మార్పులు వచ్చాయి. హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేందుకు ప్రయత్నించినా కూడా మేకర్స్ వల్ల సాధ్యం కావడం లేదు. కొంత మంది స్టార్ హీరోలు కనీసం రెండు చేస్తామని చెప్పినా అది సాధ్యం అవ్వడం లేదు.
హీరోలు తాము సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా దర్శకులు మాతో సినిమాలను చాలా ఆలస్యంగా చేస్తున్నారు అని చెబుతూ ఉంటారు. కానీ కొందరు హీరోలు మాత్రం చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఏడాదికి రెండు మూడు సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అతిగా ఆలోచించడం తో పాటు మేకర్స్ టెన్షన్ వల్ల సినిమాలు ఆలస్యం అవుతున్నాయి అనేది కొందరి వాదన.
ఎంతో మంది హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలకే కష్టపడుతున్న ఈ సమయంలో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దండ యాత్ర కొనసాగిస్తున్నాడు. అది కాకుండా విభిన్నమైన సినిమాలు ఎంపిక చేసుకుంటూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ స్థాయిలో సినిమాలు చేయడం మరే హీరోకు సాధ్యం కాదని ఆయన అభిమానులు అంటున్నారు.
ప్రస్తుత జనరేషన్ హీరోలు ఒకటి లేదా రెండు సినిమాలు చేస్తూ మరో రెండు సినిమాలు కమిట్ అయి ఉంటారేమో. కానీ ధనుష్ మాత్రం ప్రస్తుతం దాదాపుగా చేతిలో పది సినిమాలు పట్టుకుని ఉన్నాడు. వాటిల్లో కొన్ని షూటింగ్ దశలో ఉంటే కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఓ రేంజ్ లో సినిమాలతో రాబోయే రెండేళ్ల కాలంలో రాబోతున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ సినిమాల జోరు కు ఇతర హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ధనుష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేస్తున్న శేఖర్ కమ్ముల సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఏడాదిలో కెప్టెన్ మిల్లర్ చిత్రం తో రాబోతున్నాడు. ఇక తన స్వీయ దర్శకత్వంలో 50వ సినిమా ను రూపొందిస్తున్నాడు. ఇవి కాకుండా ఇంకా చాలా సినిమాలు చర్చల దశలో ఉన్నాయి, కొన్ని స్క్రిప్ట్ దశలో కూడా ఉన్నాయి. మొత్తానికి ఇండియాలో ఏ హీరో కూడా లేనంత బిజీగా ధనుష్ ఉన్నాడు అనడంలో సందేహం లేదు.