దీపావళి తర్వాత 'ధూం ధాం'.. టీజర్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో చేతన్ కృష్ణ, ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధూం ధాం.
టాలీవుడ్ యంగ్ హీరో చేతన్ కృష్ణ, ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధూం ధాం. మంచి ఎంటర్టైనర్ గా సాయి కిశోర్ మచ్చ తెరకెక్కిస్తున్న ఆ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అని పనులు పూర్తి చేసుకున్న చిత్రం.. థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
ఇప్పటివరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మల్లెపూల టాక్సీ.., మాయా సుందరి.., టమాటో బుగ్గల పిల్ల.., కుందనాల బొమ్మ.. వంటి సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. కొద్ది రోజుల క్రితం మేకర్స్ విడుదల చేసిన థీమ్ టీజర్.. ఓ రేంజ్ లో అలరించింది. అప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.
ఇప్పుడు ధూం ధాం మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ టీజర్ ను తీసుకొచ్చారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్ చాలా ఫన్నీగా ఉందని ఆయన కొనియాడారు. మూవీ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. టీజర్ తో పాటు సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. నవంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని ప్రకటించారు.
అబ్బాయి ఫేస్ లో కల ఓ లెక్కలో ఉంది.. తను దగ్గరయ్యే కొద్దీ తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది.. నో లేడర్స్.. ఓన్లీ స్నేక్స్ అంటూ పృథ్వీరాజ్ చెబుతున్న డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. అదే సమయంలో హీరో హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ను చూపించారు మేకర్స్. ఆ తర్వాత టీజర్ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. నాన్న కోసం ఈ మాత్రం ధూం ధాం చేయకపోతే థ్రిల్ ఏముంటుందిరా అంటూ హీరో చెప్పిన డైలాగ్ ఆసక్తి రేపుతోంది.
ఆ తర్వాత ఫుల్ కామెడీ సీన్స్ ను చూపించారు మేకర్స్. కడుపుబ్బా నవ్వించారు. వెన్నెల కిషోర్ జై బాలయ్య అంటూ నినదిస్తున్న డైలాగ్ తో టీజర్ ఫన్నీగా ఎండ్ అయింది. చేతన్ కృష్ణ, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. చేతన్ కృష్ణ తన తండ్రి కోసం ఏదైనా చేసే కొడుకు రోల్ లో ఇమిడిపోయారు. హెబ్బా తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మొత్తానికి మూవీ పెర్ఫెక్ట్ లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్నట్లు టీజర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. అందరినీ ఆకట్టుకుని టీజర్ దూసుకుపోతోంది. అంచనాలను ఇంకా పెంచుతోంది. మరి ధూం ధాం మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.