ఆహా మంచి వార్త... పుష్ప స్టార్ ఓటీటీ అప్‌డేట్
కానీ తెలుగు మరియు ఇతర భాషల ప్రేక్షకులు మాత్రం ధూమ సినిమాను ఓటీటీ లో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మలయాళ బాక్సాఫీస్ తో పాటు ఇతర భాషల ప్రేక్షకులను సైతం అలరిస్తున్నాడు. తాజాగా ధూమం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఫహద్ ఫాసిల్ గత చిత్రం ఆవేశం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మలయాళ ప్రేక్షకులు ధూమం సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని వెయిట్ చేశారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కానీ తెలుగు మరియు ఇతర భాషల ప్రేక్షకులు మాత్రం ధూమ సినిమాను ఓటీటీ లో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఫహద్ ఫాసిల్ పై ఉన్న అభిమానంతో ధూమ ను ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని భావించారు. కానీ ఆ సినిమాను Apple TV+ మరియు BookMyShow ల్లో మాత్రమే అందుబాటులో ఉంచారు. పైగా తెలుగు వర్షన్ ను ఆయా ఓటీటీ ల్లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరచలేదు. ఎందుకంటే వాటికి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు.
తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి నేపథ్యంలో 'ఆహా' ఓటీటీ లో స్ట్రీమింగ్ కు మేకర్స్ సిద్ధం అయ్యారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ధూమ సినిమాను జులై 11న ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయడం ఖాయం. ప్రేక్షకులకు ఇది కచ్చితంగా పెద్ద గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు.
అపర్ణ బాల మురళి, రోషన్ మాథ్యూ, అచ్యుత్ కుమార్, వినీత్ లు నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను తెలుగు లో స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా ఓటీటీ సిద్ధం అవ్వడం కచ్చితంగా మంచి వార్త అనే అభిప్రాయం ను సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.