శోభితను చైకి ప‌రిచ‌యం చేసిందెవరో తెలుసా?

తాజా ఇంట‌ర్వ్యూలో శోభిత‌కు కాబోయే మామ‌గారు నాగార్జున చెప్పిన దానిని బ‌ట్టి చై-శోభిత మ‌ధ్య చాలా జ‌రిగింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

Update: 2024-11-23 03:45 GMT

నాగ చైతన్య - శోభిత జంట వివాహ వార్త‌లు ఇటీవ‌ల‌ ట్రెండింగ్ గా మారుతున్నాయి. డిసెంబర్ 4న ఈ జంట‌ వివాహం చేసుకోనుంది. అక్కినేని ఇంట ఈ పెళ్లి చాలా సింపుల్ గా జ‌ర‌గ‌నుంది. అందుకు అన్న‌పూర్ణ స్టూడియోస్ వేదిక కానుంద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి. అయితే శోభిత‌తో నాగ‌చైత‌న్య ప‌రిచ‌యం ఎలా? అస‌లు ఆ ఇద్దరూ క‌లిసి ఒక్క‌సారి కూడా న‌టించ‌లేదు క‌దా? అయినా ఎలా జ‌త కుదిరింది? అంటూ అభిమానులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.


తాజా ఇంట‌ర్వ్యూలో శోభిత‌కు కాబోయే మామ‌గారు నాగార్జున చెప్పిన దానిని బ‌ట్టి చై-శోభిత మ‌ధ్య చాలా జ‌రిగింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. శోభిత గతంలో నాగార్జున నిర్మాణ సంస్థ అయిన‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పనిచేసింది. అలా అక్కినేని కుటుంబంతో శోభిత‌కు మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఓ ప్రాజెక్ట్ కోసం ప‌ని చేసిన శోభిత ప‌నిత‌నం వ్య‌క్తిత్వం నాగ్ ని విప‌రీతంగా ఆక‌ర్షించాయి. త‌న‌ని ప్ర‌శంసించేందుకు ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్ లో ఉన్న‌ప్పుడు త‌న‌ను క‌ల‌వాల‌ని నాగ్ ఆహ్వానించారు. అలా శోభిత నేరుగా కింగ్ ని ఆయ‌న స్వ‌గృహంలోనే క‌లిసారు. ఆ స‌మ‌యంలోనే నాగ‌చైత‌న్య అనుకోకుండా లోప‌లికి వెళ్లాడ‌ట‌. అప్పుడు శోభిత‌ను నాగార్జున స్వ‌యంగా చైకి ప‌రిచ‌యం చేసారు. ఇదే వారి మొద‌టి ప‌రిచ‌యం. ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రి న‌డుమా చాలా జ‌రిగింది. మొద‌ట స్నేహం.. ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింది. చివ‌రికి ఇప్పుడు ఈ జంట ఒక‌టి అవుతోంది.

వైజాగ్ నుండి మొద‌లై పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడానికి.. తన కలలను సాధించుకోవడానికి శోభిత చాలా కష్టపడింది. విలువలు, క‌ళ‌కు కట్టుబడి ఉన్న అద్భుతమైన నటి. అంతకుమించి గొప్ప బాండింగ్ .. స్థిర‌మైన ఆలోచ‌న క‌లిగి ఉన్న అమ్మాయి`` అని శోభితపై నాగ్ ప్ర‌శంస‌లు కురిపించారు. అలాంటి మంచి అమ్మాయి త‌మ కోడ‌లు కావ‌డం ఆనందంగా ఉంద‌ని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లికి ప‌రిశ్ర‌మ నుంచి ప‌రిమితంగానే అతిథులు హాజ‌ర‌వుతున్నారు. ఇరు కుటుంబ స‌భ్యులు, కాబోయే జంట స‌న్నిహితులు మాత్ర‌మే ఈ పెళ్లి వేడుక‌కు హాజ‌ర‌వుతారు.

Tags:    

Similar News