సంగీత ఫోన్ చేస్తే అమ‌ర్యాద‌గా మాట్లాడారా?

అయితే అన్ని భాష‌ల‌కంటే తెలుగు భాష‌కే మొద‌టి ప్రాధాన్య‌త ఇస్తాన‌ని తెలిపింది.

Update: 2024-08-21 03:30 GMT

ఒక‌ప్పుడు హీరోయిన్ గా రాణించిన సంగీతం ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్గ్ గా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. హీరోయిన్ల‌కు అమ్మ‌గా, తోడి కోడ‌లిగా, అక్క‌గా, చెల్లిగా న‌టిస్తోంది. ఇండ‌స్ట్రీలో దాదాపు రెండు ద‌శాబ్ధాల‌కు పైగా కొన‌సాగుతుంది. న‌టిగా మంచి పేరుంది. సౌత్ లో దాదాపు అన్ని భాష‌ల్లోనూ న‌టించింది. తెలుగు, తమిళ్, క‌న్న‌డం, మ‌ల‌యాళం అన్ని భాష‌ల్లోనూ వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంది.

అయితే అన్ని భాష‌ల‌కంటే తెలుగు భాష‌కే మొద‌టి ప్రాధాన్య‌త ఇస్తాన‌ని తెలిపింది. తెలుగు..త‌మిళ్ తో పొల్చినా మొద‌టి ఛాయిస్ టాలీవుడ్ అంటోంది. ఈ క్ర‌మంలో త‌మిళ ఇండ‌స్ట్రీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. `త‌మిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ గౌర‌వం ల‌భిస్తుంది. త‌మిళ్ అంటే ఇష్టం లేద‌న్న కార‌ణంగా అక్క‌డ ప్రేక్ష‌కులు నా మీద కోప‌గించుకోవచ్చు. కానీ నిజం చెప్పాలి కాబ‌ట్టి చెబుతున్నాను.

కోలీవుడ్ లో కొంద‌రు అవ‌కాశాల కోసం పోన్ చేస్తే అమ‌ర్యాద‌గా మాట్లాడుతారు. ఒక సినిమా అవ‌కాశం ఇచ్చినా? జీవితాంతం వాళ్లే అవ‌కాశాలిచ్చి పోషిస్తున్న‌ట్లు మాడ్లాడుతారు. వాళ్లు మాట్లాడే విధానం న‌చ్చ‌క అవ‌కాశాలు అడ‌గ‌డం కూడా మానేసాను. పారితోషికం ఎంత ఇవ్వాలో కూడా వాళ్లే నిర్ణ‌యిస్తారు. ఎక్క‌డైనా న‌టి డిమాండ్ చేస్తుంది. ఆ కండీష‌న్ కి ఒకే అయితే చేస్తాం. లేక‌పోతే లేదు.

కానీ త‌మిళ్ లో అందుకున్న భిన్న‌మైన పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర‌య్యాయి. అందుకే త‌మిళ్ సినిమాలు చేయ‌లేదు. ఒక‌వేళ చేస్తే గ‌నుక ఆ సినిమా యూనిట్ వాళ్లు అంతా బాగా తెలిసిన వారైతే చేస్తాను. లేక‌పోతే చేయ‌ను` అని తెలిపింది. సంగీత గాయ‌కుడు క్రిష్ ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News