రాజమౌళి ఆ విలన్ ఫస్ట్ ఛాయిస్!

ఇదిలా ఉంటే బాహుబలి సినిమా చేద్దామని ముందుగా రాజమౌళి ప్రభాస్ కి చెప్పారంట.

Update: 2024-08-04 05:59 GMT

రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ నిర్మించారు. ఈ చిత్రం హిస్టారికల్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏకంగా 700-800 కోట్ల కలెక్షన్స్ ఈ చిత్రం అందుకుంది. టాలీవుడ్ లో ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్ చిత్రంగా నిలిచింది.

ఇదిలా ఉంటే బాహుబలి సినిమా చేద్దామని ముందుగా రాజమౌళి ప్రభాస్ కి చెప్పారంట. బాహుబలి క్యారెక్టర్ గురించి ప్రభాస్ కి చెప్పగానే అతను ఒకే చెప్పారంట. తరువాత రాజమౌళి తన తండ్రి విజయేంద్రప్రసాద్ తో ఐడియాని షేర్ చేసుకున్నారంట. ఆ తరువాత విజయేంద్ర ప్రసాద్ బలమైన క్యారెక్టర్స్ తో కథని సిద్ధం చేశారు. ఇందులో బాహుబలికి పోటీగా ప్రతినాయకుడు భళ్ళాలదేవుడి పాత్రలో రానా నటించారు. ఆ పాత్రకి రానా సంపూర్ణ న్యాయం చేశారు.

నిజానికి ముందుగా ఆ పాత్ర కోసం ప్రొడ్యూసర్ శోభు, దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకోవాలని అనుకున్నారంట. ప్రభాస్ కి సరిపోయే కటౌట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఆక్వామెన్ సిరీస్ తో పాపులర్ అయిన జేసన్ మామోవాని అనుకున్నారంట. అతన్ని కాంట్రాక్ట్ చేయాలని భావించారంట. అయితే తెలుగులోనే ప్రభాస్ కి సరిపోయే కటౌట్ కోసం చూస్తే రానా కనిపించాడు. దీంతో నిర్మాత శోభు యార్లగడ్డ రానా పేరుని రాజమౌళికి సూచించారంట.

శోభునే రానాని సంప్రదించి భళ్ళాలదేవుడి పాత్రని చెప్పారంట. ముందు ఈ పాత్రకి ఎవరిని అనుకున్నారని రానా అడిగారంట. జేసన్ మమేవాని తీసుకోవాలని ప్లాన్ చేసినట్లు శోభు చెప్పారంట. రానా ఆ పాత్రపై ఆసక్తి చూపించి వెంటనే ఒకే చెప్పేశారంట. రాజమౌళి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా రానా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో భళ్ళాలదేవుడి పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. అలా రాజమౌళి మొదటి పాన్ ఇండియా సినిమాలోనే హాలీవుడ్ యాక్టర్ ని అనుకోని ఆగిపోయారంట.

రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరీకి నెట్ ఫ్లిక్స్ లో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. రాజమౌళి తన మొదటి సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలని ఇందులో పంచుకున్నారు.

Tags:    

Similar News