శోభితా తెనాలి అమ్మాయే.. ఫ్యామిలీ ట్రీలోకి వెళితే..!

హాట్ టాపిక్ గా మారిన నాగచైతన్య ఎంగేజ్ మెంట్.. శోభితా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి.. ఆమె సొంతూరు గురించి వెతకటం ఎక్కువైంది.

Update: 2024-08-09 04:37 GMT

టాలీవుడ్ హీరో నాగచైతన్య.. నటి శోభితా ధూళిపాళ్లకు ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని టాలీవుడ్ హీరో నాగార్జున అధికారికంగా విడుదల చేయటంతో.. ఇంతకాలం సాగిన ప్రేమాయణం గుట్టు రట్టైంది. గడిచిన రెండేళ్లుగా వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్లుగా ప్రచారం జరిగినా.. అదెప్పుడూ అధికారికంగా ప్రకటించింది లేదు. తాజాగా ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పే బాధ్యతను నాగార్జున తీసుకోవటంతో.. ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది. హాట్ టాపిక్ గా మారిన నాగచైతన్య ఎంగేజ్ మెంట్.. శోభితా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి.. ఆమె సొంతూరు గురించి వెతకటం ఎక్కువైంది.

శోభితా ధూళిపాళ్ల అచ్చ తెలుగు అమ్మాయి అని.. ఆమెది తెనాలి అన్న విషయాన్ని తాజాగా తేల్చారు. అంతేకాదు.. ఆమె ఫ్యామిలీ ట్రీ బయటకు వచ్చింది. శోభిత మేనమామ.. న్యాయవాది జంధ్యాల శివగణేశ్ గురువారం ఫ్యామిలీ ట్రీ వివరాల్ని వెల్లడించారు. తెనాలికి చెందిన టీచర్ జేవీఎల్ శ్రాస్త్రి.. కమలమ్మ దంపతుల కుమార్తె శాంతా కామాక్షి. ఆమె బీఎస్సీ.. బీఈడీ చేసి తెనాలి మున్సిపల్ స్కూల్ లో టీచర్ గా పని చేశారు.

ఆమెకు విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజినీర్ వేణుగోపాల్ తో పెళ్లైంది. వారికి ఇద్దరు అమ్మాయిలు. వారిలో పెద్ద అమ్మాయి శోభిత.. రెండో అమ్మాయి సమంత. వీరిద్దరూ తెనాలిలోనే పుట్టారు. పాత రోజుల్లో ప్రెగ్నెన్సీ వస్తే.. డెలివరీకి పుట్టింటికి రావటం.. అక్కడే డెలివరీ కావటం ఒక అలవాటుగా ఉండేది. ఇప్పుడు మాత్రం వైద్య సదుపాయాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో.. అక్కడే డెలివరీలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు.

టీచర్ గా పని చేసిన శోభిత తల్లి పెళ్లి తర్వాత జాబ్ కు లాంగ్ లీవ్ పెట్టి విశాఖపట్నంలో కొంతకాలం ఉన్నారు. తర్వాత వారి కుటుంబం ముంబయిలో స్థిరపడింది. ముంబయికి ముందు విశాఖలో ఉన్న శోభితా.. లిటిల్ ఏంజెల్స్.. విశాఖ వ్యాలీ స్కూల్ లో చదువుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013లో టైటిల్ గెలుచుకున్న ఆమె.. బాలీవుడ్ లో తొలుత ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు.. తమిళం. మలయాళంలో హీరోయిన్ గా ట్రై చేసినా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువ మార్కులు పడ్డాయి.

సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో అలరించిన శోభితా.. తెలుగులోకి మాత్రం అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ‘మేడ్ ఇన్ హెవన్', 'బర్డ్ ఆఫ్ బ్లడ్', 'ది నైట్ మేనేజర్‌' వెబ్ సిరీస్ ల్లో తన నటనతో అందరి మనన్నలు పొందింది. సినిమాలు.. వెబ్ సిరీస్ లతో పాటు.. యాడ్స్ లోనూ నటిస్తూ భారీగా సంపాదించినట్లు చెబుతారు. ఆమె ఆస్తుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక అంచనా ప్రకారం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.35 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. తెనాలి నుంచి వెళ్లిన తర్వాత నుంచి ఊరికి రావటం బాగా తగ్గినట్లుగా జంద్యాల శివగణేష్ చెబుతున్నారు.

Tags:    

Similar News