ఆవిడని కావాలనే పక్కనబెట్టారా?
సరిగ్గా అదే సమయంలో ఆ కన్నడ ఎంట్రీ ఇవ్వడం...బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకోడంతో దర్శక-నిర్మాతల దృష్టి ఆమెపై పడింది.
ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే ఉంటే సరిపోదు. క్రమశిక్షణ అంతకు మంచి ఉండాలి. ఎంతో డౌన్ టూ ఎర్త్ ఉండాలి. ఆ క్వాలిటి లేకపోతే ఇండస్ట్రీ ఎంత వేగంగా పైకి లేపుతుంతో? అంతే వేగంగా పాతాళానికి తొక్కే స్తుంది. ఈ విషయంలో హీరోయిన్లు ఎంతో కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ బ్యాలెన్స్ తప్పితే కెరీర్ గందరగోళానికి గురవ్వక తప్పదు. టాలీవుడ్ లో ఓ సక్సెస్ ఫుల్ హీరోయిన్ పరిస్థితి ఇప్పుడలాగే ఉందని అంటున్నారు.
వస్తూనే అమ్మడు స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. విజయాలు కూడా అలాగే వరించాయి. చేసిన మూడు నాలుగు సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే. అవి మంచి విజయాలు సాధించాయి. దీంతో అమ్మడు లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకుంది. అప్పటివకే వస్తోన్న కొత్త భామలంతా ఫెయిల్యూర్ లో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ కన్నడ ఎంట్రీ ఇవ్వడం...బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకోడంతో దర్శక-నిర్మాతల దృష్టి ఆమెపై పడింది.
దీంతో అమ్మడికి అడ్వాన్సులు బాగానే చెల్లించారు. ఈ విషయంలో అమ్మడి డిమాండ్ ని కూడా నిర్మాతలు స్వాగతించారు. తాను ఏం చెబితే అది చేయడానికి రెడీ అయ్యారు. తమవైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగదని..అలాగే తన వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకోవాలని సూచించా రుట. అయితే ఈ మాటని ఓ నిర్మాత కాస్త గట్టిగానే చెప్పాడుట. అలాగని నోచ్చుకునే విధంగా ప్రవర్తించలేదుట.
సున్నితంగానే చెప్పాడుట. కానీ ఆ చిన్న మాటకు సదరు హీరోయిన్ ఫీలైందిట. నిర్మాత వైపు తప్పు లేకపోయినా కాస్త అతి చేసిందనే గుస గుస తెరపైకి వచ్చింది. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆ నిర్మాత మిగతా నిర్మాతలతోనూ సంప్రదించి పరిస్థితి వివరించే సరికి అలా ఎంత కాలం బెట్టు చేస్తుందో చూద్దాం...అవకాశాలన్నింటిని హోల్డ్ లో పెట్టండని నిర్ణయానికి వచ్చారుట. ఆ క్రమంలో ఆ నటికి రావాల్సిన అవకాశాలు ఒక్కసారిగా తగ్గాయన్నది తాజా సమాచారం. అలా ఓ రెండు అవకాశాలు కోల్పోయిందని వినిపిస్తుంది.