కల్కికి రాయన్‌కు మధ్య తేడా అదే.. ఆన్లైన్‌లో షురూ అయిన టాప్ లిస్ట్ లొల్లి
అందుకే తాజాగా అర్షద్ వార్సి మాటలకు కామన్ మ్యాన్‌తో పాటు సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అయ్యారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు.. కానీ డార్లింగ్ ప్రభాస్ వారి అందరిలో భిన్నమైన వాడు. అతనికి అభిమానులు ప్రేక్షకులలో మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలలో కూడా ఉండడం విశేషం. అందుకే హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రభాస్ దూసుకుపోతున్నాడు. ఇక సోషల్ మీడియాలో ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. డార్లింగ్ మీద అతని అభిమానులు ఒక్క మాట కూడా పడనివ్వరు. అందుకే తాజాగా అర్షద్ వార్సి మాటలకు కామన్ మ్యాన్‌తో పాటు సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అయ్యారు.
ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ప్రభాస్ సినిమాకు ధనుష్ చిత్రానికి పోలికేంటి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే.. ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో కల్కి స్ట్రీమింగ్ అవుతోంది. మరుసటి రోజు అంటే ఆగస్టు 23న అదే ప్లాట్ఫారంలో ధనుష్ నటించిన రాయన్ చిత్రం కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక ట్రెండింగ్ అవుతున్న చిత్రాలను అమెజాన్ ప్రైమ్ క్రమం తప్పకుండా తమ టాప్ లిస్టులో పెట్టి ప్రేక్షకులను ఊరిస్తారు. అయితే అందులో ధనుష్ చిత్రం మొదటి స్థానంలో ఉండడం..కల్కి రెండవ ప్లేస్‌లో ఉండడం మరొక ఆన్లైన్ వివాదానికి తెర లేపుతోంది.
ప్రభాస్ నటించిన కల్కి చిత్రం.. మహాభారతం నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే కల్కి అవతారానికి సంబంధించిన కథాంశంతో సాగుతుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. వేయి కోట్లకు పైగా తన ఖాతాలో వేసుకొని.. అన్ని భాషలలో ప్రజలను మెప్పించిన చిత్రం కల్కి. ఇక ధనుష్ నటించిన రాయన్ చిత్రం విషయానికి వస్తే.. తమిళ్ ఇండస్ట్రీలో ఈ మూవీ కలెక్షన్స్ బ్రహ్మాండంగా రాబట్టింది. కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాబట్టి కల్కికి ఈ చిత్రానికి పోలిక పెట్టే అవకాశం లేదు.
ఇక కల్కి మూవీ చూడడం కోసం థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కట్టారు. మరోపక్క రాయన్ చిత్రాన్ని టికెట్ కొని మరి థియేటర్‌కి వెళ్లి చూసిన వారి సంఖ్య తక్కువ. కాబట్టి ఈ మూవీని ఆన్లైన్‌లో చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే కల్కి ఎలాగో థియేటర్లో చూసాము.. రాయన్ మూవీని ఇంట్లో ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు. అంతెందుకు కొన్ని సందర్భాల్లో థియేటర్లో డిజాస్టర్ అయిన చిత్రాలను కూడా ఈ ఓటిటి టాప్ వన్ లిస్టులో పెడుతూ ఉంటారు. అంతమాత్రాన మిగిలిన సినిమాలతో వాటిని పోల్చలేము కదా. ఈ నేపథ్యంలో ధనుష్ మూవీ, ప్రభాస్ మూవీని డామినేట్ చేస్తుంది అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా హడావిడి చేయడం హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు డార్లింగ్ అభిమానులు.