2024 డిజిటల్ రిలీజ్.. స్లాట్ క్లోజ్
ప్రస్తుతం సినిమాలకి థీయాట్రికల్ తో పాటు నాన్ థీయాట్రికల్ బిజినెస్ డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీల ద్వారా వస్తోంది
ప్రస్తుతం సినిమాలకి థీయాట్రికల్ తో పాటు నాన్ థీయాట్రికల్ బిజినెస్ డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీల ద్వారా వస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ అయిన నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్, సోనీ లివ్, జియో సినిమా లాంటి కొత్త సినిమాల డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవల్ లో ఈ ఛానల్స్ సినిమాలని కొనుగోలు చేస్తున్నాయి. అలాగే వెబ్ సిరీస్ లు కూడా నిర్మిస్తున్నాయి. పెద్ద సినిమాల కోసం నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్ నుంచి ఎక్కువ పోటీ పడుతూ ఉంటాయి.
అయితే ప్రతి డిజిటల్ ప్లాట్ ఫామ్ కి ఏడాదికి సంబందించిన కంటెంట్ క్యాలెండర్ ఉంటుంది. ఈ క్యాలెండర్ ఇయర్ లో ప్రతి భాషకి కొంత బడ్జెట్ కేటాయిస్తారు. ఆ బడ్జెట్ ఉన్నంత వరకు సినిమాలు కొనుగోలు చేస్తారు. మూవీకి ఉన్న బజ్ బట్టి రేటు డిసైడ్ చేస్తారు. కొన్ని సినిమాలకి పెద్ద మొత్తంలో డిజిటల్ రైట్స్ రూపం లో చెల్లిస్తారు. పాన్ ఇండియా లెవల్ లో వీలైనన్ని ఎక్కువ భాషలలో రిలీజ్ చేయడానికి స్కోప్ ఉన్న చిత్రాలకి డిజిటల్ కంపెనీలు ఎక్కువ మనీ ఖర్చు పెడతాయి.
ఇదిలా ఉంటే 2024 సంవత్సరానికి గాను డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు రిలీజ్ మూవీ స్లాట్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ వరకు సినిమాల రిలీజ్ కి సంబందించిన ఒప్పందాలు మేగ్జిమమ్ క్లోజ్ చేసిందంట. సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అయితేనే తప్ప నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయే సినిమాలు కొనే ఛాన్స్ లేదంట. డిజిటల్ రైట్స్ ని ఇప్పటికే లాక్ చేసుకున్న సినిమాలు థీయాట్రికల్ రిలీజ్ కి ఎలాంటి డోకా లేదని తెలుస్తోంది.
ఓజీ మూవీ డిజిటల్ రైట్స్ సోల్డ్ కాకపోవడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అలాగే కొంతమంది డిజిటల్ రైట్స్ కోసం ప్రయత్నం చేస్తున్న ఫలితం లేదంట. డిజిటల్ రైట్స్ అమ్ముడుపోకుండా కేవలం థీయాట్రికల్ బిజినెస్ మీద నమ్మకం పెట్టుకొని సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. దీనికి కారణం కంటెంట్ ఎంతో బాగుందనే టాక్ వస్తేనే తప్ప ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లడం లేదు.
అదే డిజిటల్ రైట్స్ క్లోజ్ అయితే పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా రికవరీ ఉంటుంది. తద్వారా థియేటర్స్ రిలీజ్ లో పెట్టుబడిలో సగం వచ్చిన నిర్మాత సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొత్తం రికవరీ థియేటర్స్ ద్వారానే రాబట్టడం సాధ్యం కాదని నిర్మాతల అభిప్రాయం. అందుకే కొంతమంది తమ సినిమాల రిలీజ్ 2025కి వాయిదా వేసుకుంటున్నట్లు టాక్