రిస్క్ లేకుండా దిల్ రాజు సేఫ్ కాంబినేషన్?

ప్రస్తుతం ఒక సాలిడ్ కథను రెడీ చేశారని, దిల్ రాజుకి వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Update: 2025-01-24 05:16 GMT

దిల్ రాజు ఇటీవల పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ తో ఊహించని డిజాస్టర్‌ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ సినిమా అంచనాల్ని అందుకోలేకపోగా, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది. మరోవైపు ఐటి రెయిడ్స్ తో కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే ఇంతటి నష్టాల తర్వాత, దిల్ రాజు పాజిటివ్ వైబ్‌ను పొందడానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అతనికి గేమ్ ఛేంజర్ నష్టాలను కొంతవరకు కవర్ చేసే అవకాశం ఇచ్చింది.

అయితే, ఈ టైమ్‌లో దిల్ రాజు కొంతకాలం పాటు పెద్ద సినిమాల వైపు వెళ్లకుండా, చిన్న బడ్జెట్, మీడియం రేంజ్ సేఫ్ కాంబినేషన్స్‌తో విజయాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, గీతా గోవిందం, సర్కారు వారి పాట వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ పెట్లతో దిల్ రాజు కలిసి మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పరశురామ్ తో ఇది వరకే ఫ్యామిలీ స్టార్ తో డిజాస్టర్ ఎదుర్కొన్నప్పటికీ ఈసారి పొరపాటు లేకుండా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ప్రస్తుతం ఒక సాలిడ్ కథను రెడీ చేశారని, దిల్ రాజుకి వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా నటించనున్నట్లు టాక్. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సిద్ధు, వరుస విజయాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. సిద్ధు నటిస్తున్న తాజా చిత్రం జాక్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేకాకుండా, తెలుసు కదా, కోహినూర్ చిత్రాలు కూడా సిద్ధుతో తెరకెక్కుతున్నాయి.

ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో పరశురామ్ చెప్పిన కథకు సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రంలో సిద్ధు పాత్ర ఎలా ఉండబోతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌కి అధికారిక ప్రకటన వెలువడితే మంచి అంచనాలను పెంచుతుందనడంలో సందేహం లేదు. పరశురామ్ దర్శకత్వ ప్రతిభ, సిద్ధు యంగ్ ఆడియెన్స్‌పై ఉన్న క్రేజ్, దిల్ రాజు మార్కెట్ అనుభవం వర్కౌట్ అయితే, ఈ ప్రాజెక్ట్ రిస్క్ లేకుండా భారీ విజయాన్ని అందించే అవకాశాలున్నాయి.

వీరి కాంబినేషన్ సేఫ్‌గా ఉండడమే కాకుండా, విడుదలకు ముందే ప్రాఫిట్స్ వచ్చే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ చిన్న బడ్జెట్‌లో ఉండవచ్చనే కారణంగా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు లేని ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశముంది. మొత్తానికి, గేమ్ ఛేంజర్ తరువాత దిల్ రాజు ఈ కొత్త ప్రాజెక్ట్‌తో సేఫ్ జోన్‌లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ కాంబినేషన్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News