దిల్ రాజు.. మళ్ళీ బలగం లాంటి నమ్మకం!

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పైన పెద్ద సినిమాలని నిర్మిస్తున్నారు.

Update: 2024-08-21 04:04 GMT

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పైన పెద్ద సినిమాలని నిర్మిస్తున్నారు. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో సెకండ్ బ్యానర్ ని స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ పై వారి పిల్లలు హర్షిత్, హన్షిత నిర్మాతలుగా మూవీస్ చేస్తున్నారు. ఈ బ్యానర్ నుంచి మొదటి సినిమాగా బలగం మూవీ వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. గత ఏడాది టాలీవుడ్ లో అత్యధిక ప్రాఫిట్ సాధించిన మూవీగా బలగం నిలిచింది.

దీని తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సెకండ్ మూవీగా లవ్ మీ వచ్చింది. ఈ సినిమాలో ఆశీష్ హీరోగా నటించాడు. లవ్ మీ డిజాస్టర్ అయ్యింది. మరల ప్రొడక్షన్ నెంబర్ 3గా జనక అయితే గనక అనే మూవీ వస్తోంది. సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

పిల్లలు వద్దనుకునే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెన్ గా సుహాస్ ఈ చిత్రంలో నటించాడు. సెప్టెంబర్ 7న ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. బలగం తర్వాత మరో ఇంటరెస్టింగ్ కథనంతో దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తోన్న చిత్రంగా ఇది ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అందుకే చాలా థియేటర్స్ ని ఈ చిత్రం కోసం బ్లాక్ చేస్తున్నారంట.

సెప్టెంబర్ 5న ఇళయదళపతి విజయ్ GOAT మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగులో కూడా భారీ అంచనాల మధ్యలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకి దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి జనక అయితే గనక రిలీజ్ కాబోతోంది. బలగం లాంటి సక్సెస్ ని ఈ చిత్రం రిపీట్ చేస్తుందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నారంట. అందుకే ప్రమోషన్స్ ని గట్టిగా చేసి వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

సుహాస్ కూడా ఈ ఏడాది ప్రసన్నవదనం సినిమాతో సక్సెస్ అందుకున్నారు. దీంతో అతని కథల సెలక్షన్స్ పై పబ్లిక్ లో ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఈ నేపథ్యంలో జనక అయితే గనక మూవీ కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. సుహాస్ ఇమేజ్ కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News