దిల్ రాజు గేమ్ చేంజర్ ప్లాన్ ఏంటో..?

దిల్ రాజు మాత్రం ఆర్.ఆర్.ఆర్ తో చరణ్ కి వచ్చిన ఇమేజ్ ని గేమ్ చేంజర్ కి ఫుల్ గా వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

Update: 2023-07-27 14:30 GMT

RRR తర్వాత రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అంతకుముందు శంకర్ కమల్ హాసన్ కాంబో మూవీని నిర్మించాలని అనుకున్న దిల్ రాజు ఆ సినిమాకు అడ్వాన్స్ కూడా ఇవ్వగా ఆ ప్రాజెక్ట్ చేతులు మారడంతో శంకర్ తో రాం చరణ్ సినిమా సెట్ చేశాడు.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత ఆచార్య సినిమా ఫ్లాప్ అయినా అది చరణ్ కెరీర్ మీద అంత ఇంప్యాక్ట్ చూపించలేదు. ప్రస్తుతం శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ చేంజర్ మీద మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు.

శంకర్ సినిమాలంటే సౌత్ లో సూపర్ క్రేజ్ ఉంటుంది. రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలు చేస్తున్నాడు కానీ అంతకుముందు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించిన ఇండియన్ డైరెక్టర్స్ లిస్ట్ లో శంకర్ కూడా ఉన్నారు. అలాంటి డైరెక్టర్ తో రాం చరణ్ చేస్తున్న ఈ గేమ్ చేంజర్ భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తున్నా నిర్మాత దిల్ రాజు గేమ్ చేంజర్ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం గేమ్ చేంజర్ నుంచి టీజర్ కానీ పోస్టర్ కానీ అడుగుతున్నారు కానీ అవేవి రిలీజ్ చేయకుండా దిల్ రాజు అండ్ టీం వెయిటింగ్ లో పెడుతున్నారు.

ఇంతకీ గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు..? ఈ సినిమా విషయంలో దిల్ రాజు ప్లాన్ ఏంటి..? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దిల్ రాజు మాత్రం ఆర్.ఆర్.ఆర్ తో చరణ్ కి వచ్చిన ఇమేజ్ ని గేమ్ చేంజర్ కి ఫుల్ గా వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

గేమ్ చేంజర్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని ముందు ప్లాన్ చేసినా 2024 సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఎలాగు పొంగల్ రేసుకి రిలీజ్ అనుకున్న ప్రాజెక్ట్ K కల్కి వాయిదా పడినట్టే. మహేష్ గుంటూరు కారం కూడా సమ్మర్ కి షిఫ్ట్ అవుతుందని టాక్. రవితేజ ఈగల్ ఒక్కటే ప్రస్తుతానికి సంక్రాంతికి రిలీజ్ పక్కా అంటున్నారు. సో గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తే బాగుంటుందని చూస్తున్నారు. మరి అనుకున్న విధంగా పొంగల్ రేసులో చరణ్ గేమ్ చేంజర్ వస్తుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News