దిల్‌రుబా రొమాంటిక్ ఫ్లేవర్: 'హే జింగిలి' అంటూ మ్యూజికల్ మ్యాజిక్!
ఈ సినిమా మాస్, యూత్ ఆడియెన్స్‌ను ఆకర్షించేలా రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుందని టీజర్ ద్వారా స్పష్టమైంది.
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల మళ్ళీ డిఫరెంట్ సినిమాలతో ఫామ్ లోకి వచ్చాడు. 'క' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మొదటిసారి 25 కోట్ల మార్క్ ను టచ్ చేయడం విశేషం. ఇక ఆ సినిమా అనంతరం మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు తన కొత్త చిత్రం దిల్‌రుబా కోసం సిద్దమవుతున్నాడు. ఈ సినిమా మాస్, యూత్ ఆడియెన్స్‌ను ఆకర్షించేలా రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుందని టీజర్ ద్వారా స్పష్టమైంది.
మార్చి 14న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా, ఇప్పటికే తొలి సింగిల్ ‘అగ్గిపుల్లే’ పాటతో హైప్‌ను పెంచేసింది. ఇప్పుడు రెండో పాట ‘హే జింగిలి’ని రిలీజ్ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈ లేటెస్ట్ మెలోడీకి సామ్ సి ఎస్ అందించిన ట్యూన్ ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రేమలో ఉన్నవారి అనుభూతులను అందంగా చెప్పేలా భాస్కర భట్ల రాసిన సాహిత్యం హార్ట్‌టచింగ్‌గా ఉంది.
'నచ్చావులే మచ్చలేని జాబిలమ్మ, నీవల్లనే ఎత్తాను చూడు కొత్త జన్మ...' అనే లైన్స్ కూడా వినసొంపుగా ఉన్నాయి. ఈ పాటలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ హైలైట్ అవుతోంది. మ్యూజిక్‌తో పాటుగా విజువల్స్ కూడా క్లాసీగా ఉండటంతో, ఈ పాట ప్రేక్షకులను మైమరపింపజేస్తోంది. కిరణ్ అబ్బవరం తన లుక్‌లో స్టైలిష్ మార్పు తీసుకురావడంతో పాటు, ఈ సినిమాలో మరింత మ్యాచుర్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ పాటలో ఆయన చేసిన సింపుల్ డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి.
రుక్సార్ ధిల్లాన్ గ్లామర్, నాజూకుతనం, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా స్థాయిని పెంచేలా ఉంది. దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమాను అద్భుతమైన విజువల్స్‌తో రిచ్‌గా మలచినట్లు సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతోంది. సినిమాటోగ్రఫీ డేనియల్ విశ్వాస్ హ్యాండిల్ చేయగా, ఎడిటింగ్ బాధ్యతలను ప్రవీణ్ కె ఎల్ నిర్వర్తిస్తున్నారు. నిర్మాణ పరంగా శివం సెల్యులాయిడ్స్, యూడ్లీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండటంతో, ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉంటాయని అర్థమవుతోంది.
ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి. ముఖ్యంగా రొమాంటిక్ థ్రిల్లర్‌గా కొత్త వేవ్‌ను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం గతంలో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ, దిల్‌రుబా పూర్తిగా కొత్త జానర్‌లో ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ ద్వారా కిరణ్ అబ్బవరం మరోసారి తన మాస్ యూత్ క్రేజ్‌ను నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. ‘హే జింగిలి’ మెలోడీ హిట్‌గా నిలవడంతో పాటు, సినిమా రిలీజ్ వరకు హైప్‌ను కొనసాగించేలా ఉంది. ఇక మార్చి 14న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.