ట్రాఫిక్ జామ్ అయింది..డీసీపీలు ఎక్కడ? డింపుల్ హయతి!
హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఘోరంగా ఉంది
యంగ్ బ్యూటీ డింపుల్ హయత్ కార్ పార్కింగ్ విషయంలో ఓ పోలిస్ అధికారితో వాగ్వివాదం కొన్ని రోజుల క్రితం ఎంత సంచలనమైందో తెలిసిందే. పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఎవరికి వారే న్యాయం దక్కాలంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చివరిగా ఆ వివాదం ఎలా సద్దుమణిగిందన్నది క్లారిటీ లేదు.
కానీ తాజాగా డింపుల్ హయతి హైదరాబాద్ ట్రాపిక్ లో ఇరుక్కుని తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితిని ఉద్దేశించి అమ్మడు ఓ పోస్ట్ పెట్టింది. ఆపోస్టుకి మంత్రి కేటీఆర్ ని...పోలీస్ అధికారుల్ని ట్యాగ్ చేసింది.
'హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఘోరంగా ఉంది. ఇంటికి చేరుకోవాలంటే గంటకు పైగా ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడీ ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడ ఉన్నారు? ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏమి చేయాలి? మళ్లీ మనం హైదరాబాద్‌లో అడుగు పెట్టగలమా? ప్రియమైన ప్రభుత్వమా మాకు ఉచితంగా ఇంధనం లభించదు' అంటూ ఓ పోస్ట్ పెట్టింది.
దీంతో డింపుల్ పోస్ట్ పై నెటి జనులు తమదైన శైలిలో విరచుకుప డుతున్నారు. ఇప్పటివరకూ ఎప్పుడు అమ్మడు హైదరాబాద్ ట్రాపిక్ లో ఇరుక్కోలేదా? కొత్తగా ఇప్పుడే ఈ సమస్యని ఎదుర్కుంటున్నట్లు? మాట్లాడుతుందేంటి? అంటూ మండిపడుతున్నారు. వాస్తవానికి హైదరాబా ద్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ట్రాపిక్ జామ్ అన్నది సాధారణంగా ఎదురయ్యే సమస్య.
ట్రాపిక్ లో ఇరుకోకుండా ఉండాలనే ప్రభుత్వాలు ముందుగానే ప్రజలంతా ఇళ్లలోనూ..సురక్షిత ప్రాంతాల్లోనూ హెచ్చరిస్తుంటాయి. అవసరం మేర ట్రాఫిక్ దారి మళ్లీస్తుంటారు. ఇవన్నీ తెలియకుండా డింపుల్ అర్ధం లేని పోస్ట్ లు పెడుతుందని మండిపడు తున్నారు. ఇలాంటి వాటితో ప్రభుత్వాన్ని నిందించడం సమజసం కాదు.
వ్యక్తిగత సమస్యలేవైనా ఉంటే? అంతే వ్యక్తిగతంగా చూసుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం డింపుల్ పార్కింగ్ వివాదం ట్రాపిక్ డీసీపీతోనే ఎదుర్కుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తనని గంటల తరబడి స్టేషన్ లో వెయిట్ చేయించారని డింపుల్ ఆవేదన చెందిన సంగతి తెలిసిందే.