స్టార్ హీరోకి గ్యాంగ్ స్ట‌ర్ బెదిరింపుతో సౌత్ డైరెక్ట‌ర్‌కి ట్ర‌బుల్స్

ఈ ప‌రిస్థితి ఇప్పుడు సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ కి ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించింది.

Update: 2024-10-18 03:15 GMT

పాపుల‌ర్ క‌థానాయ‌కుడి స్నేహితుడిని హ‌త‌మార్చ‌డం ద్వారా స‌ద‌రు హీరోకి వార్నింగ్ బెల్స్ మోగించాడు క‌ర్కోఠ‌క గ్యాంగ్ స్ట‌ర్. ఇది ప‌రోక్షంగా ఆ హీరోని హ‌త్య చేస్తాం జాగ్ర‌త్తగా ఉండాల‌నే బెదిరింపుగా పోలీసులు ప‌రిగ‌ణిస్తున్నారు. దీంతో స్టార్ హీరో తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నాడు. ఈ ప‌రిస్థితి ఇప్పుడు సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ కి ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించింది. వివ‌రాల్లోకి వెళితే...


ఇదంతా సల్మాన్ ఖాన్ తో గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ వైరం గురించిన స్టోరి. ఎన్సీపీ నాయ‌కుడు బాబా సిద్ధిక్ హత్య అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సల్మాన్ ఖాన్ కి ఇది సూటిగా హెచ్చ‌రిక‌. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాబా సిద్ధిక్ హత్య వెనుక తమ హస్తం ఉందని పేర్కొంది. సల్మాన్ ఖాన్‌తో పొలిటీషియన్‌కు ఉన్న సంబంధమే ఇందుకు కారణమని కూడా తేలింది. కొన్ని నెలల క్రితం ముంబైలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల కూడా కాల్పులు జరిగాయి. హత్య బెదిరింపులు రావడంతో సల్మాన్ ఖాన్ చుట్టూ భద్రతను పెంచారు. సిద్ధిఖ్ హ‌త్యతో ఈ ఆందోళ‌న‌లు మ‌రింత పెరిగాయి. బాబా సిద్ధిక్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సల్మాన్ ఖాన్ తన సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ప్ర‌స్తుతం స‌ల్మాన్ తీవ్ర భ‌యాందోళ‌న‌లో ఉన్నాడ‌ని మీడియా క‌థ‌నాలు చెబుతున్నాయి. ఇది అతడి సినిమా సికందర్ షూటింగ్ షెడ్యూళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌న్న ఆందోళ‌న నెల‌కొంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సల్మాన్ ఖాన్ షూటింగ్ కొనసాగించబోతున్నాడని గుస‌గుస వినిపిస్తోంది.

హిందుస్థాన్ టైమ్స్‌లోని ఒక కథనం ప్రకారం.. సికందర్ షెడ్యూల్‌లో మార్పు వచ్చినట్లు వచ్చిన క‌థ‌నాలొచ్చాయి. కానీ ఇది నిజం కాదని సల్మాన్ ఖాన్ మేనేజర్ ధృవీకరించారు. సినిమా సెట్స్‌పై భద్రత పెంచామని, షూటింగ్ కొనసాగుతోందని కూడా సోర్స్ చెబుతోంది. సల్మాన్ సర్ తన చుట్టూ ఎప్పుడూ సెక్యూరిటీతో ఉంటారు. అయితే ఇటీవల అదనంగా 8-10 మంది సిబ్బందిని చేర్చుకున్నారు. అతడు రాకముందే వారు రెక్కీ కోసం వస్తారు అని సోర్స్ తెలిపింది. షెడ్యూల్‌లో మ‌హా అయితే ఒకటి లేదా రెండు రోజులు మారవచ్చు.. కానీ పెద్దగా మార్పు ఏమీ లేదని తెలిపారు. సికందర్ షూట్ నవంబర్ లేదా డిసెంబర్ నాటికి పూర్తవుతుందని భావించారు.. అయితే అది ఇప్పుడు జనవరి నాటికి ముగించే వీలుంది. అయితే ప్రస్తుతం సెట్లో స‌ల్మాన్ భద్రతకు ప్రాధాన్యతను పెంచారు.

అర్బాజ్ ఖాన్ ఇటీవల ప్రెస్ మీట్‌లో బాబా సిద్ధిక్ మరణం.. సల్మాన్ ఖాన్ భద్రత గురించి మాట్లాడారు. ప్రస్తుతం చాలా జరుగుతున్నాయని, అందరూ ఆందోళన చెందుతున్నారని ఆర్భాజ్ అన్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని, అత‌డు సురక్షితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులతో పాటు, ప్రతి ఒక్కరూ స‌హ‌క‌రిస్తున్నార‌ని అన్నారు.

Tags:    

Similar News