శంకర్.. ఆయనను చూసి నేర్చుకోవాలా?

తమిళ సినిమాలపై తెలుగు సినీ ప్రియులకు ఆసక్తి కలిగించిన వారు ఎవరంటే? అంతా టక్కున డైరెక్టర్లు మణిరత్నం, శంకర్ పేర్లే చెప్పేస్తారు.

Update: 2024-09-23 02:30 GMT

తమిళ సినిమాలపై తెలుగు సినీ ప్రియులకు ఆసక్తి కలిగించిన వారు ఎవరంటే? అంతా టక్కున డైరెక్టర్లు మణిరత్నం, శంకర్ పేర్లే చెప్పేస్తారు. కోలీవుడ్ మూవీస్ ను కమర్షియల్ గా ఓ రేంజ్ కు తీసుకెళ్లిందని శంకర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. 80s, 90s కిడ్స్ లో ఎంతోమందికి ఆయన ఫేవరెట్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ గా తన హవా చూపించారు. తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు.

అంతలా క్రేజ్ సంపాదించుకున్న ఆయన తీస్తున్న సినిమాలు.. కొన్నాళ్లుగా మిస్ ఫైర్ అయిపోతున్నాయి. సినీ ప్రియులను మెప్పించలేకపోతున్నాయి. ముఖ్యంగా శంకర్ తీసుకునే టైమ్ పీరియడ్ అండ్ బడ్జెట్ కు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొన్నేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇండియన్-2 మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు శంకర్. దారుణమైన మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

అధిక బడ్జెట్ తో శంకర్ భారతీయుడు -2 తీయడం వల్ల మేకర్స్ కు భారీ నష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ నటించిన మూవీ కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇండియన్ -2లో శంకర్ మార్క్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. కంటెంట్ బాగుంటేనే.. దిల్ రాజు పెట్టిన బడ్జెట్ కూడా రిటర్న్ వస్తుంది!

అయితే శంకర్ లో కొన్ని మార్పులు రావాలని కొందరు నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సూచిస్తున్నారు. షెడ్యూల్స్ ఎలా ప్లాన్ చేయాలో, ఒక ప్లాన్ రూపంలో సినిమా ఎలా తెరకెక్కించాలో డైరెక్టర్ మణిరత్నం దగ్గర నేర్చుకోవాలని చెబుతున్నారు. మణిరత్నం వర్కింగ్ ప్లాన్ కరెక్ట్ గా ఉండడం వల్ల.. అనేక మంది ప్రొడ్యూసర్ల డబ్బు ఆదా అవుతుందని అంటున్నారు. థగ్‌ లైఫ్‌ మూవీ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

మణిరత్నం, కమల్ హాసన్ కాంబో అనేక ఏళ్ల తర్వాత థగ్‌ లైఫ్‌ మూవీతో రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్ ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేశారు మణిరత్నం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. అది కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. షూటింగ్ కూడా ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే పూర్తి చేశారు. అలా ఆయన యంగ్ అండ్ అప్ కమింగ్ డైరెక్టర్స్ కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అదే సమయంలో శంకర్ కూడా మణిరత్నం నుంచి నేర్చుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News