తేజ.. తనయుడి ఎంట్రీ కోసం పవర్ఫుల్ టైటిల్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసేవారు. ఇక "నేనే రాజు నేనే మంత్రి"తో సూపర్ హిట్ సాధించిన తర్వాత మరొక పెద్ద హిట్ అందుకోలేకపోయారు.

Update: 2024-09-18 11:30 GMT

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసేవారు. ఇక "నేనే రాజు నేనే మంత్రి"తో సూపర్ హిట్ సాధించిన తర్వాత మరొక పెద్ద హిట్ అందుకోలేకపోయారు. దీంతో ఆయన కొంత గ్యాప్ తీసుకుని, నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల కోసం సిద్ధమవుతున్నారు. అహింసా అనంతరం తేజ మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ లోనే మరొక సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చింది.

రానా దగ్గుబాటితో ఒక క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. అలాగే గోపిచంద్ తో కూడా ఒక సినిమా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టుపై ఎనౌన్స్ మెంట్ అనంతరం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతం తేజ కొత్త కథలపై దృష్టి సారించారని, ఆయన కొందరు రచయితలతో కథలు వింటున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా తేజ ఒక ఫాంటసీ జోనర్ కథపై ఆసక్తి చూపుతున్నారట.

ఈ కథ తన కుమారుడి ఎంట్రీకి చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారట. తేజ తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడానికి ఇదే సరైన సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు 'హనుమంతు' అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ ఫాంటసీ కథలో లవ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని, తేజ ఈ సినిమాను లవ్ జోనర్‌లో రూపొందించాలని అనుకుంటున్నారట.

గతంలో ఆయన ప్రేమకథలను తన ప్రత్యేక శైలిలో తెరకెక్కించి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు తన కుమారుడి ఎంట్రీ కోసం కూడా అదే సక్సెస్ ఫార్ములాను ఉపయోగించాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై తేజ పూర్తి హోంవర్క్ మొదలు పెట్టారని, తన కుమారుడిని సరైన సమయంలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. తన కుమారుడిని కథలోని పాత్రకు సరిపడే విధంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

తేజ దర్శకుడిగా కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించారు, కానీ గత కొంతకాలంగా హిట్లు లేకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగించింది. ఇప్పుడు తన కుమారుడి ఎంట్రీతో మరోసారి తేజ బౌన్స్ బ్యాక్ అవుతారనే అంచనాలు ఉన్నాయి. తేజ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ వార్తలపై నిజానిజాలు తెలియాలంటే తేజ అఫీషియల్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

Tags:    

Similar News