యానిమల్ సైగతో.. నగవంశీ ఘాటైన కౌంటర్
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి ఓ మై బేబీ అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి ఓ మై బేబీ అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదట ధమ్ మసాలా రాగా ఇది సెకండ్ సింగిల్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇక థమన్ థమన్ కంపోజింగ్ లో వచ్చిన ఈ పాట కి ఫ్యాన్స్ నుంచి అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. త్రివిక్రమ్ సినిమాలు అంటేనే బెస్ట్ సాంగ్స్ ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అలాంటిది గుంటూరు కారం నుంచి వచ్చిన ఈ సాంగ్ అంత ఇంప్రెసివ్ గా లేకపోవడంతో గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ని ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. సాంగ్ అస్సలు భాగోలేదని, వెంటనే తొలగించాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఓ విధంగా ఈ ట్రోలింగ్ తో చిత్ర యూనిట్ కి తలనొప్పి తెప్పిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ హంగామాపై ఇప్పటికే లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. లిరిక్స్ గురించి విమర్శలు చేయడంతో వాటికి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా నాగవంశీ కూడా ఈ ట్రోలింగ్ మీద ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. యానిమల్ సినిమాలోని లాస్ట్ సీన్ రణబీర్ బూతు సైగను పోస్ట్ చేసి అందరికి సైలెంట్ గా ఉండమని చెప్పాడు.
మేము ఏమి చేస్తున్నామో మాకు తెలుసు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకొస్తాం. వెయిట్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. గుంటూరు కారం సినిమాకి సంబందించిన ప్రతి అప్డేట్ ముందుగా నాగవంశీ నుంచే వస్తోంది. ఇలా ఓ మై బేబీ సాంగ్ మీద విమర్శలు రావడంతో సీరియస్ గా రియాక్ట్ అయ్యి ట్రోలింగ్ చేస్తున్న అందరికి నాగవంశీ వార్నింగ్ ఇవ్వడం వైరల్ గా మారింది.
దీనిపై ట్రోలర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గుంటూరు కారం సినిమా విషయంలో ఆరంభం నుంచి ఏదో ఓక రకంగాగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సినిమా బాగా లేట్ కావడంతో సూపర్ స్టార్ అభిమానులు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. అలాగే అప్డేట్స్ విషయంలో అవుట్ ఫుట్ ఏ మాత్రం నచ్చకపోయిన వెంటనే విమర్శలు చేస్తున్నారు. మరి రాబోయే అప్డేట్స్ తో అయినా ఆడియెన్స్ ను మెప్పిస్తారో లేదో చూడాలి.