ఏప్రిల్ ఫూల్.. ఈ దర్శకులు కొట్టిన దెబ్బ మర్చిపోగలమా?
ఒక బిగ్ సినిమా సరైన కాంబినేషన్ లో వస్తే దానిపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
ఒక బిగ్ సినిమా సరైన కాంబినేషన్ లో వస్తే దానిపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక దర్శకులు ఇచ్చే ఎలివేషన్స్ కూడా ఫ్యాన్స్ లో మరింత ఆశను పెంచుతాయి. ఇక అలా హైప్ క్రియేట్ చేసి షాక్ ఇచ్చిన దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆడియెన్స్ పెద్దగా నిరాశపడరు. కానీ అసలు ఏమాత్రం అంచనాలకు తగ్గట్టుగా లేని సినిమాలను తీసి బిల్డప్ ఇస్తే మాత్రం గట్టిగా హర్ట్ అవుతారు. ఒక విధంగా అది పర్ఫెక్ట్ ఏప్రిల్ ఫూల్ డే అని చెప్పవచ్చు.
ఇక ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను ఫూల్స్ చేసిన కొంతమంది దర్శకుల డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఒకసారి వారిపై లుక్కేస్తే.. దర్శకుడు రాధాకృష్ణ మొదటి సినిమా జిల్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ ప్రభాస్ అతనికి మంచి అవకాశం ఇచ్చాడు. ఇక రాధేశ్యామ్ విడుదలకు ముందు ఆ దర్శకుడు ఇచ్చిన ఎలివేషన్స్ మామూలుగా క్లిక్ కాలేదు. మనల్ని ఎగ్జిట్ చేసేదే కదా మాస్ సినిమా అంటే.. తప్పకుండా ఇది కూడా అలాంటిదే అవుతుంది అని ఆయన ఒక రేంజ్ లో పొగిడారు. కానీ సినిమా లో కంటెంట్ మాత్రం ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ కాలేదు. స్క్రీన్ ప్లే దారుణంగా ఉంది అనే కామెంట్స్ వచ్చాయి.
ముఖ్యంగా అప్పట్లో స్పైడర్ సినిమా క్రియేట్ చేసిన హైప్ మామూలుగా వర్కౌట్ కాలేదు. ఫస్ట్ టీజర్ తోనే దర్శకుడు ఆడియన్స్ ను ఫూల్స్ చేశాడు అని చెప్పవచ్చు. అప్పట్లో మహేష్ పై ఒక స్పైడర్ రోబో ను చూపించిన విధానం ఒక రేంజ్ లో వైరల్ అయింది. దీంతో సినిమాలో ఏదో ఉంటుందని ఆశించిన ఆడియన్స్ కు ఆ సీనే లేకపోవడం పెద్ద మోసమే. మహేష్ ఫ్యాన్స్ కు అది కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. అదే లిస్టులో బ్రహ్మోత్సవం కూడా ఉంటుంది.
ఇక మినిమం కంటెంట్ తో వచ్చే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అజ్ఞాతవాసితో కోలుకోలేని గాయాన్ని మిగిల్చాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూస్తారు అని ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన విధానంకు ఆడియన్స్ ఒక రేంజ్ లో ఉహించుకున్నారు. కానీ సినిమాలో పవన్ పాత్రను కొన్ని సీన్స్ లలో లేడీస్ అలిగినట్లుగా చూపించి నిరుత్సాహ పరిచారు. ఆ విషయంలో గురూజీపై ఇప్పటికీ ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు.
ఇక దర్శకుడు బోయపాటి గుండెల మీద చేయి వేసుకునే సినిమా చూడండి అంటూ వినయ విధేయ రామ సినిమాను రిలీజ్ చేశాడు. ఆ డైలాగ్ స్కంద సినిమా ఈవెంట్ లో కూడా వినిపించింది. వినయ విధేయ రామ సినిమా ఎంత డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. అప్పటివరకు బోయపాటికి ఉన్నా రేంజ్ మళ్లీ ఒక్కసారిగా తగ్గిపోయింది.
ఇక మీమ్ మెటీరియల్ గా ఉన్న మెహర్ రమేష్ శక్తి డైలాగ్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. శక్తి సినిమా టైంలో ఆయన ఎన్టీఆర్ రుద్ర లుక్ విడుదల చేస్తూ ఇచ్చిన ఎలివేషన్ నందమూరి ఫ్యాన్స్ కు అప్పుడు అర్థం కాలేదు. కానీ సినిమా విడుదల తర్వాత ఆయన ఫూల్స్ ని చేశాడు అని చాలా బాధపడ్డారు. ఈ తరహాలో చాలామంది దర్శకుడు చాలా రకాలుగా ఎలివేషన్స్ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టారు. ఇక ప్రస్తుతం అయితే స్టార్ హీరోల ఫ్యాన్స్ ఇలాంటి దర్శకులను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము అని ఏప్రిల్ ఫూల్ డే రోజు గుర్తు చేసుకుంటున్నారు.