స్టార్ దర్శకుడికి గుండెపోటు.. ఆరోగ్య పరిస్థితి విషమం

స్టార్ దర్శకుడు సిద్ధిఖీ గుండెపోటుతో ఆసుపత్రిలో చేర్చారు.ప్రస్తుతం ఆయన కండీషన్ క్రిటికల్ గా ఉన్నట్లు చెబుతున్నారు

Update: 2023-08-08 05:11 GMT

కరోనా తర్వాత సామాన్యులు.. సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా గుండెపోటుకు గురవుతున్న ఉదంతాలు వరుస పెట్టి చోటు చేసుకుంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. ఎప్పుడు.. ఎందుకు.. ఎలా వస్తుందో తెలీకుండానే వచ్చేస్తున్న గుండెపోటు ధాటికి పలు విషాద ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా మలయాళ స్టార్ దర్శకుడు సైతం గుండెపోటు బారిన పడ్డారు. ప్రస్తుతం క్రిటికల్ కండీషన్ లో ఉన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సినిమా ఇండస్ట్రీని టెన్షన్ పెట్టేస్తున్న గుండెపోటు వార్తలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. మొన్నీ మధ్యనే నటి శ్రుతి షణ్ముగ ప్రియ అకాల మరణం.. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుటుంబానికి చెందిన మరో నటి స్పందన సోమవారం కన్నుమూయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. స్టార్ దర్శకుడు సిద్ధిఖీ గుండెపోటుతో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన కండీషన్ క్రిటికల్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

మలయాళంతో పాటు తెలుగు.. తమిళం.. హిందీ సినిమాల్ని చేసిన ఆయన పలు సినిమాల్లో నటించారు కూడా. గాడ్ ఫాదర్.. వియత్నాం కాలనీ.. కాబూలీ వాలా తదితర మలయాళ సినిమాలతో ఫేమస్ అయిన ఆయన.. టాలీవుడ్ లోనూ నితిన్ తో కలిసి "మారో" అనే మూవీ చేశారు.

కానీ.. అదేమీ సక్సెస్ కాకపోవటంతో తెలుగులో మరో సినిమా చేయలేదు. దర్శకుడిగా ఇప్పటికే తానేమిటో ఫ్రూవ్ చేసుకున్న ఆయన.. నటుడిగా పలు సినిమాల్లో యాక్ట్ చేయటంతో పాటు.. పలు టీవీ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. గుండెపోటుతో ఆసుపత్రిలో ఉన్న ఆయన త్వరగా కొలుకోవాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News