ఆయన బయోపిక్..అదో చెత్త అనేసిన డైరెక్టర్!
అలాంటి సమయంలో ఇలాంటి సినిమా తెరపైకి రావడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రచార బృందం డైరెక్టర్ స్టీవెన్ చియూంగ్ ఈ సినిమాపై ప్రత్యేకంగా మండిపడ్డారు.
అమెరికా మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ కి వెండి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవలే కేన్స్ ఫిల్మ్ పెస్టివల్ లో ప్రదర్శించారు. 'ది అప్రెంటిస్' టైటిల్ తో ప్రసారమైన సినిమాపై ఆయన బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టులో సవాల్ చేస్తామని వెల్లడించాయి. 1970, 1980 లలో ట్రంప్ అమెరికా స్తిరాస్థి వ్యాపారంలో ఎలా ఎదిగారో ఇందులో చూపించారు. ఇందులో కొన్ని సన్నివేశాలు కల్పితమని , మాజ అధ్యక్షుడి ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఆయన ప్రచారం బృందం ఆరోపించింది.
దీన్ని ఓ చెత్త చిత్రంగా కొట్టిపారేసింది. ఇదంతా హాలీవుడ్ ప్రముఖులు చేసిన కుట్రగా అభివర్ణించింది. చాలా సన్నివేశాలు కల్పితాలు అనే డిస్ క్లైమర్ తోనే ఈ చిత్రం ప్రారంభమవుతుందని సమీక్షకులు వెల్లడించారు. శృంగార తారకు అక్రమ నిధుల బదిలీ కేసులో ట్రంప్ ప్రస్తుత కోర్టు విచారణ ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. మరోవైపు నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరుపున బరిలోఉన్నారు.
అలాంటి సమయంలో ఇలాంటి సినిమా తెరపైకి రావడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రచార బృందం డైరెక్టర్ స్టీవెన్ చియూంగ్ ఈ సినిమాపై ప్రత్యేకంగా మండిపడ్డారు. అసత్యాలను సంచలనం చేసేందుకే తీసిన ఓ చెత్త సినిమా అని విరుచుకుపడ్డారు. ఇందులో చూపించినవన్నీ కల్పితాలని ఆగ్రహం వ్యక్తం చేసారు. హాలీవుడ్ ప్రముఖులంతా కలిసి ఓ చెత్తని తెచ్చే ప్రయత్నం చేసారన్నారు. ఎన్నికల ముందు రిలీజ్ చేయడం వెనుక అంతరార్ధం ఏంటి? అని ఇదంతా రాజకీయ ఎత్తుగడ అని మండిపడ్డారు.
దీనిపై సినిమా దర్శకుడు సినిమా చూడకుండా కోర్టులో సవాల్ చేయడం సరికాదని ఖండించారు. ఈసినిమా చూస్తే ట్రంప్ కచ్చితంగా ఆశ్చర్యపోతారని , ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయన ఆగ్రహించరని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ట్రంప్ గత పాలన...ఆయనపై ఉన్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారు? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.