బన్నీని ఆవహించిన సుకుమార్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంతటి వాడు అయ్యాడంటే? దాని వెనుక దర్శకుడు సుకుమార్ ఉన్నాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంతటి వాడు అయ్యాడంటే? దాని వెనుక దర్శకుడు సుకుమార్ ఉన్నాడు. ఆయన లేకపోతే `ఆర్య` లేదు. `ఆర్య-2` లేదు..`పుష్ప` లేదు. ఇంకేమీ లేదు. ఈ మాటలు స్వయంగా బన్నీ నోటి నుంచి వచ్చినవే. `పుష్ప` విజయోత్సవంలో భాగంగా ఎంతో ఎమోషనల్ గా చెప్పిన మాటలివి. ఇక పుష్ప రాజ్ పాత్రతో జాతీయ ఉత్తమ నటుడిగా టాలీవుడ్ లో చరిత్రే సృష్టించాడు.
ఉత్తమ నటుడిగా బన్నీ పేరు బయటకొచ్చిన ఆనందంలో తన అభిమనమంతా సుకుమార్ పై ఎలా చూపించాడో చూసాం. బలంగా హత్తుకుని... బుగ్గులపై ముద్దు ఇచ్చి తన ప్రేమనంతా చాటాడు. ఇదంతా సుకుమార్ పై బన్నీ కున్న ప్రేమాభిమానం అనుకుంటే పొరబడినట్లే. అంతకు మించి ఆ ఇద్దరి మధ్య బాండింగ్ ఉందని తాజాగా బన్నీ మాటల్ని బట్టి బయటపడింది.
సినిమా జీవితంలోనే కాదు..వ్యక్తిగత జీవితంలో సుకుమార్ ఉన్నాడని తెలుస్తోంది. తన కెరీర్ కి సంబంధించి ఏ అంశమైన సుకుమార్ తో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాడుట. అలాగే తను ఏ సినిమాలు చేసినా కూడా లెక్కలు మాష్టారు గైడెన్స్ తప్పని సరి అంటున్నారు. ఆయన్ని సంప్రదించకుండా ఏదీ చేయరుట. అంటే ఈ లెక్కన బన్నీని సుకుమార్ ఎంతగా ఇన్ ప్లూయెన్స్ చేస్తున్నారు? అన్నది అద్దం పడుతుంది.
నటుడిగా ఎదిగే క్రమంలో సుకుమార్ ని ఎంతగా అభిమానించాడో ఎదిగిన తర్వాత అదే అభిమానం ఇసుమొత్తు కూడా కరగకుండా ఆ బంధాన్ని కంటున్యూ చేస్తున్నాడు. బన్నీ ఎంత గొప్ప డైరెక్టర్ తో సినిమా చేసినా ఆ కథ గురించి కచ్చితంగా సుకుమార్ కి తెలుస్తుందన్న మాట. ఇలా ఎంత అభిమానం లేకపోతే `సుక్కు అన్నా` అని పిలుస్తారు. ఇది బన్నీ వ్యక్తిత్వానికి సంబంధించి గొప్ప అంశంగా చెప్పాలి. సక్సెస్ ఇచ్చిన దర్శకుల్ని మర్చిపోయిన హీరోలెంతో మంది ఉన్నారు. స్టార్ గా నిలబెట్టిన దర్శకుల్ని మర్చిపోయి న హీరోలున్నారు. కానీ అలాంటి వాళ్లకి బన్నీ వ్యతిరేకం. తన మొత్తం జీవితంలోనే సుకుమార్ ఉన్నాడు.