టైగర్ నాగేశ్వరరావు.. వాటి కోసమే ఎక్కువ ఖర్చు
తాజాగా సినిమా గురించి వంశీ కృష్ణ ఇంటరెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఈ మూవీ కోసం 15 కోట్ల రూపాయిలతో ప్రత్యేకంగా సెట్ లు వేయడం జరిగిందని అన్నారు.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ టైగర్ నాగేశ్వరావు. ఈ మూవీ దసరాకి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని దశకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగా నడుస్తున్నాయి. మాస్ రాజా రవితేజ నార్త్ ఇండియాలో సైతం సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నడూ లేనంతగా ఈ చిత్రం కోసం కష్టపడుతున్నాడు. ఇదిలా ఉంటే దర్శకుడు వంశీకృష్ణ కూడా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ టైగర్ నాగెశ్వరరావు చిత్రానికి కొంత బూస్టింగ్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. తాజాగా సినిమా గురించి వంశీ కృష్ణ ఇంటరెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఈ మూవీ కోసం 15 కోట్ల రూపాయిలతో ప్రత్యేకంగా సెట్ లు వేయడం జరిగిందని అన్నారు.
ప్రతి రోజు 300 నుంచి 400 మంది వర్క్ సెట్స్ కోసం వర్క్ చేస్తూ ఉండేవారని తెలిపారు. స్టార్టింగ్ డే నుంచి మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో రవితేజ గారు క్యార్ వ్యాన్ నుంచి బయటకి వస్తే టైగర్ నాగేశ్వరావు వస్తున్నారని ఫీల్ అవుతూ ఉండేవాడినని, అందుకే కథని అద్భుతంగా ఆవిష్కరించగలిగానని తెలిపారు.
అలాగే ఈ స్టొరీ కోసం ఐదేళ్ళ పాటు వర్క్ చేసానని, ఎంతో రీసెర్చ్ చేసి కథని సిద్ధం చేయడం జరిగిందని, మొత్తం కథ ఒకే అయిన తర్వాత సెట్స్ పైకి వెళ్లానని అన్నారు. కచ్చితంగా మూవీ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టైగర్ నాగేశ్వరావు ఆ రోజుల్లో ఈ విధంగానే ఉండేవాడా అనేలా రవితేజ పెర్ఫార్మెన్స్ సినిమాలో ఉందనే మాట వినిపిస్తోంది.
కొంత పాజిటివ్ వైబ్ అయితే సినిమా చుట్టూ ఉంది. అయితే దసరాకి టైగర్ నాగేశ్వరరావుకి పోటీగా లియో, భగవంత్ కేసరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి పోటీ తట్టుకొని ఏ మేరకు ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.