వంశీ పైడిపల్లి.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?
స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా ఏంటి.. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో వారిసు సినిమా చేసిన వంశీ పైడిపల్లి తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు.
స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా ఏంటి.. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో వారిసు సినిమా చేసిన వంశీ పైడిపల్లి తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు. తన ప్రతి సినిమా విషయంలో డైరెక్టర్ వంశీ చేస్తున్న జాప్యానికి కారణాలు ఏంటి. ఇలా వంశీ పైడిపల్లి అనగానే ఇలాంటి పదుల సంఖ్యలో డౌట్లు ప్రశ్నలు రాకమానవు. మున్నా సినిమాతో డైరెక్టర్ గా మారిన వంశీ పైడిపల్లి 16 ఏళ్ల కెరీర్ లో కేవలం 6 సినిమాలు మాత్రమే చేశాడు.
ఒక్కో సినిమాకు 3 ఏళ్లు గ్యాప్ తీసుకోవడం వంశీ పైడిపల్లికి అలవాటుగా మారింది. 2007 లో మున్నా చేసిన వంశీ పైడిపల్లి 2010 లో బృందావనం సినిమా చేశాడు. ఆ తర్వాత 2014లో ఎవడు, 2016 లో ఊపిరి చేశాడు. మళ్లీ మహేష్ తో మహర్షి చేసేందుకు 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. మహర్షి టైం లో వంశీ పైడిపల్లి తన కోసం వెయిట్ చేయడం గురించి సూపర్ స్టార్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.
వంశీ పైడిపల్లి చేసిన ఈ 6 సినిమాలు దాదాపుగా అన్నీ దిల్ రాజు నిర్మాణంలోనే వచ్చాయి. దిల్ రాజుతోనే తను సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యే వంశీ ఇలా సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే అతను రాసుకున్న కథ సూటయ్యే హీరో వేరే ప్రాజెక్ట్ లో ఉంటే అతని సినిమా పూర్తయ్యే దాకా వంశీ పైడిపల్లి ఎదురు చూస్తారు. స్టార్ హీరోలంతా కూడా వేరే సినిమాలతో బిజీగా ఉండటం కూడా వంశీ సినిమా లేట్ కు మరో కారణమని తెలుస్తుంది. అందుకే వంశీ సినిమాలకు ఇంత గ్యాప్ వస్తుందని అర్థమవుతుంది.
3 ఏళ్లకో సినిమా చేస్తున్న వంశీ పైడిపల్లి ఈమధ్య ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపిస్తున్నాడు. ఈవెంట్ లకే పరిమితమై తన సినిమాల గురించి వదిలేశాడంటూ అతన్ని టార్గెట్ చేశారు నెటిజన్లు. వారిసు తర్వాత మళ్లీ విజయ్ తో వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అర్థమైంది.
వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా ఏంటి ఎప్పుడు అన్నది అసలేమాత్రం క్లారిటీ లేదు. ఇలా నాలుగేళ్లకు ఒక సినిమా చేస్తే డైరెక్టర్ గా అతను రేసులో వెనకపడినట్టే. ఈ విషయాన్ని గుర్తించి వంశీ పైడిపల్లి వరుస సినిమాలు చేస్తే బెటర్ అని అతని సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ కోరుతున్నారు. వంశీ పైడిపల్లి నెక్స్ట్ అప్డేట్ ఏంటన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే