ప్రభాస్‌ని ఖాన్‌ల‌ను టార్గెట్ చేస్తున్న డైరెక్ట‌ర్..కార‌ణ‌మిదేనా?

వివేక్ అగ్నిహోత్రి పరిశ్రమకు స్టార్ల‌కు వ్యతిరేకంగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు

Update: 2023-08-19 04:06 GMT

వివేక్ అగ్నిహోత్రి పరిశ్రమకు స్టార్ల‌కు వ్యతిరేకంగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. ఇంత‌కుముందు ఆదిపురుష్ విడుద‌ల స‌మ‌యంలో ప్ర‌భాస్ కి న‌ట‌న రాదంటూ ప‌రోక్షంగా కించ‌ప‌రిచాడు. తాగి వెళ్లే స్టార్ దేవుడిగా న‌టించాడంటూ అవ‌మానించాడు. తాగిన స్టార్లు దేవుళ్లు అవ్వ‌డ‌మేంటి? అని కూడా కామెంట్ చేసాడు. ప‌లుమార్లు ఖాన్ ల‌ను అత‌డు దూషించాడు. ప్రస్తుతం మరోసారి సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ స‌హా బాలీవుడ్ లోని ఇతర పెద్ద తార‌ల‌ను దూషించి హెడ్ లైన్స్ లోకొచ్చాడు. బాలీవుడ్‌ను నాశనం చేసాడంటూ షారుఖ్ ఖాన్‌ను అగ్నిహోత్రి ఇప్పుడు దూషించాడు. దిగుమతి చేసుకున్న సంస్కృతిని ప్రోత్సహించినందుకు కరణ్ జోహార్‌ను నిందించాడు. ఇండస్ట్రీ వ్యక్తులపై వివేక్ అగ్నిహోత్రి బహిరంగంగా తూటాలు పేలుస్తున్నాడు.

అయితే కింగ్ ఖాన్ షారుఖ్ కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనతో ఇంటర్నెట్‌లో అగ్గి రాజుకుంది. బాలీవుడ్ వంటి గొప్ప వ్య‌వ‌స్థ‌ను నాశనం చేయడానికి SRK కారణమని అగ్నిహోత్రి కామెంట్ చేసారు. షారూఖ్ ఖాన్ రాజకీయాలు నాకు నచ్చవు. అతడి కారణంగా PR, హైప్, గ్లామర్ - స్టార్‌డమ్ మాత్రమే మిగిలాయి. స్టార్‌డమ్ లేని దేనినైనా ఇక్క‌డ‌ అంగీకరించరు. అది నా సమస్య.. అని వ్యాఖ్యానించాడు. స్టార్లు ఎవ‌రూ లేకుండా సినిమాలు తీసే అగ్నిహోత్రికి నిజంగానే షారూఖ్ పెద్ద స‌మ‌స్య అని దీనినిబ‌ట్టి అర్థమైంది. అయితే వివేక్ అగ్నిహోత్రి ఖాన్ ని దూషిస్తూనే.. ఇదే ఇంటర్వ్యూలో ఖాన్‌తో తన షరతుల ప్రకారం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు.

షారుఖ్ ఖాన్ నా మార్గంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటే నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ నా సినిమాకి వర్క్ చేస్తుంటే రైటర్, డైరెక్టర్ ముందు వరుసలో ఉంటాడు. స్టార్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటాడు. కానీ షారూఖ్‌ దాన్ని ఎప్పటికీ అంగీకరించడు. కాబట్టి అతడు ఎప్ప‌టికీ నాతో పని చేయడు.. అని వ్యాఖ్యానించాడు. షారుఖ్ ఖాన్‌తో తనకున్న రెండవ అతిపెద్ద సమస్య ఏమిటంటే.. సామాన్య ప్రేక్షకులు మూగవారని వారి (ఖాన్ లు) గట్టి నమ్మకం. అది సహించలేను. నేను ప్రజల సినిమాలు తీస్తాను. వారు బాక్సాఫీస్‌ వద్ద ఆడే సినిమా మాత్ర‌మే చేస్తారు. వారి సినిమా సక్సెస్ అయితే అది షారుఖ్ ఖాన్ సినిమా. నా సినిమా సక్సెస్ అయితే జనాల సినిమా స‌క్సెస్‌... అని అగ్నిహోత్రి అన్నారు. తన రాజకీయాల కోసం ఖాన్ పై కామెంట్ చేసి దానిచుట్టూ హైప్‌ను సృష్టించాడ‌ని ప‌లువురు నెటిజ‌నులు సీరియ‌స్ అవుతున్నారు.

కరణ్ జోహార్ స్టార్‌డమ్ లేదా స్టార్ సిస్టమ్‌ను అతిగా కీర్తించడం వల్ల తనకు చాలా సమస్యలు ఉన్నాయని వివేక్ అన్నారు. దిగుమతి చేసుకున్న విలువలను ప్రోత్సహిస్తున్నందుకు మధ్యతరగతి, హిందీ మాట్లాడే, భారత‌దేశ‌ పూర్వ‌పు మూలాలున్న ప్రతిభావంతులైన పౌరులు అభివృద్ధి చెందడానికి అనుమతించని వ్యవస్థను సృష్టించాడ‌ని క‌ర‌ణ్ ని నిందించాడు.

ఆదిపురుష్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ పై ప్రపంచం నిందలు వేస్తున్నప్పుడు, వివేక్ అగ్నిహోత్రి కూడా వారితో చేరి విమ‌ర్శించారు. తాను నమ్మనిది చేయవద్దని.. ట్రెండింగ్‌లో ఉన్నందున హైప్ కోసం మాత్రమే సినిమా చేయమని ఓంరౌత్ కి సలహా ఇచ్చాడు. ప్రజలు ఇడియట్స్ కాదని అతను పేర్కొన్నాడు.

బాలీవుడ్ స్టార్లు భారీ ఫీజులు వసూలు చేయడం వ్యానిటీవ్యాన్ ల కోసం డబ్బు వృధా చేయడంపై వివేక్ అగ్నిహోత్రి నిరాశ వ్యక్తం చేశారు. వ్యానిటీ వ్యాన్‌లను తయారు చేయడం .. అధిక పారితోషికాలు వసూలు చేయడం ద్వారా విలాసవంతమైన వస్తువులపై విపరీతమైన ప్రచారాన్ని కోరుకోవ‌డాన్ని దూషించారు. షారూఖ్ ఖాన్ పఠాన్ విడుద‌ల‌య్యాక‌ బాలీవుడ్ ప్రముఖులను వివేక్ నిందించాడు. పఠాన్ పై విరుచుకుపడిన ఆయన తన ట్విట్టర్‌లో బాలీవుడ్ మ‌ళ్లీ బ్యాడ్ షేప్‌లో ఉందని రాశారు. ఓపెనింగ్‌కి కూడా గ్యారెంటీ ఇవ్వలేని స్టార్‌లకు అవాస్తవికమైన విపరీతమైన పారితోషికాలు ఇవ్వడంతో పరిశ్రమ మొత్తం సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా డబ్బు వ్యర్థం.. స్టార్ల‌ జీవనశైలి వ‌ల్ల‌ వృధా అవుతుంది... తప్పు జరుగుతోంది.. అని వ్యాఖ్యానించాడు.

ఏదో ఒక కార‌ణంతో బాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను ఎంచుకుని, వారిని తిట్టే వివేక్ అగ్నిహోత్రి తాను అలా ఎందుకు చేస్తున్నాడో కూడా తెలిపాడు. నాకు ఎవ‌రిపైనా పగ లేదు. కానీ నేను బాలీవుడ్‌ను మార్చాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. బాలీవుడ్ తనను తాను ఆవిష్కరించుకుని ప్రపంచంలోనే అత్యుత్తమ చిత్ర పరిశ్రమగా మారాలని కోరుకుంటున్నాను. బాలీవుడ్ లాఫింగ్ స్టాక్ కాకుండా భారతదేశానికి సాఫ్ట్ పవర్ కావాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు. అయితే అత‌డు సోష‌ల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఇలా చేస్తున్నాడ‌ని న‌మ్మే ప్ర‌జ‌లు లేక‌పోలేదు. ప్ర‌ముఖుల‌పై నింద‌లు వేయ‌డం ద్వారా తాను సోష‌ల్ స్టార్ కావాల‌నుకుంటున్నాడ‌ని ప‌లువురు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Tags:    

Similar News