కమిటీ కుర్రాళ్లు డైరెక్టర్ పెద్ద స్కెచ్చే..!

అవకాశం అందిరికీ వస్తుంది కానీ అలా వచ్చిన దాన్ని వాడుకున్న వారికే మంచి కెరీర్ ఉంటుంది.

Update: 2024-08-17 05:49 GMT

అవకాశం అందిరికీ వస్తుంది కానీ అలా వచ్చిన దాన్ని వాడుకున్న వారికే మంచి కెరీర్ ఉంటుంది. సినిమా పరిశ్రమలో మాత్రం ఛాన్స్ వచ్చినప్పుడే టాలెంట్ చూపించాలి అలా ప్రతిభ కనబరిస్తే చాలు వాళ్లకి మంచి ఫాలోయింగ్ ఏర్పరుస్తుంది. తెర మీద కనిపించే వారి అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తెర వెనక పనిచేసే వారు తమ ప్రతిభతో ప్రేక్షకులను మెప్పిస్తారు. ఈమధ్య కాలంలో అలా తెర వెనక మెగా ఫోన్ పట్టుకుని సినిమాను సక్సెస్ చేస్తున్న యువ దర్శకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో యదు వంశీ ఒకరు.

ఈమధ్యనే కమిటీ కుర్రాళ్లు సినిమా తీసి ఆడియన్స్ మెప్పు పొందిన ఈ దర్శకుడు సినిమాల మీద ఆసక్తితో మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని సైతం వదిలి వచ్చేశాడని తెలుస్తుంది. తాడేపల్లి గూడెం లో పుట్టి పెరిగిన యదు వంశీ ఎంబీఏ పూర్తి కాగానే జాబ్ లో జాయిన్ అయ్యాడట. ఆరెంకల జీతంతో జీవితం సాగుతున్నా ఒక దశలో ఇది కాదు కదా నేననుకున్న జీవితం అనిపిచిందట. వెంటనే ఉద్యోగం మానేసి కమిటీ కుర్రాళ్ల కథ రాసుకున్నారట.

ఐతే అంతకుముందు తను తీసిన షార్ట్ ఫిలిం అందరి ప్రశంసలు అందుకుంది. కమిటీ కుర్రాళ్లు కథ పట్టుకుని చాలా ప్రొడక్షన్ హౌస్ లకు వెళ్లాలని. అందరు కొత్త వారితో చేయాలనుకున్న నా కలను కొందరు చెరిపేయాలని అనుకున్నారు. కొందరు నిరుత్సాహ పరిచారు. కొందరు కథ మార్చమని అన్నారు. కానీ ఎవరేం చెప్పినాం వినకుండా ప్రయత్నాలు చేశాడట. ఫైనల్ గా నిహారిక కథ విని నిర్మించడానికి సిద్ధమయ్యారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు యదు వంశీ.

కమిటీ కుర్రాళ్ల కోసం నాలుగేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా ఈ నాలుగేళ్లు కొత్త జీవితాన్ని ఫేస్ చేశాను. లక్షల జీతం తీసుకున్న తనకు కొన్నిసార్లు చిన్న మొత్తం కూడా అడ్జెస్ట్ అవ్వక ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు యదు వంశీ. ఈ సినిమా చూసిన వారంతా మళ్లీ మా జీవితాన్ని ఒకసారి చూపించావని కామెంట్ చేస్తుంటే ఒక దర్శకుడిగా ఇంతకన్నా ఏం కావాలనిపిస్తుంది. కమిటీ కుర్రాళ్లు ఈ గ్రాండ్ సక్సెస్ వెనక 11 మంది నటీనటులు, కెమెరామెన్, ఎడిటర్, అసిస్టెంట్స్ వీరంతా కలిస్తేనే ఈ సినిమా సాధ్యమైందని అన్నారు. ఇక చిరంజీవిని చూసే సినిమాల్లోకి రావాలని అనుకున్నానని ఆయనకు యాక్షన్ చెప్పే రోజు కోసం ఎదురుచూస్తానని అన్నారు యదు వంశీ.

Tags:    

Similar News