కల్కి : ఆమె ముగించేసిందట!
పాట చిత్రీకరణలో భాగం అయిన హీరోయిన్ దిశా పటానీ తాజాగా ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చినట్లుగా సోషల్ మీడియా ద్వారా పేర్కొంది
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో కల్కి 2898 ఏడీ సినిమా ఒకటి. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. చివరగా మిగిలి ఉన్న పాట చిత్రీకరణ కోసం ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు ఇటలీ వెళ్లారు.
పాట చిత్రీకరణలో భాగం అయిన హీరోయిన్ దిశా పటానీ తాజాగా ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చినట్లుగా సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ఎట్టకేలకు ఢిల్లీ చేరుకున్నాను అంటూ దిశా చేసిన పోస్ట్ తో కల్కి ఇటలీ షెడ్యూల్ పూర్తి అయినట్లు అంతా భావిస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకొణె తో పాటు బాలీవుడ్ మరో స్టార్ హీరోయిన్ దిశా పటానీ నటిస్తున్నట్లుగా గతంలోనే ప్రకటన వచ్చింది. ఆమె పాత్ర ఏంటి, సెకండ్ హీరోయిన్ గానే ఆమె ఉంటుందా లేదంటే కథ లో లీడ్ ఉంటుందా అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్, యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ ఇంకా పలు భాషలకు చెందిన ప్రముఖ నటి నటులు నటించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమా కోసం అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఒక వైపు షూటింగ్ ను హడావుడిగా పూర్తి చేస్తూనే మరో వైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా పూర్తి చేస్తున్నారు. సినిమా యొక్క విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ మరింత స్పీడ్ గా చేస్తున్నట్లుగా ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.