బ్లాక్ బికినీలో మైండ్ బ్లాక్ చేసిన దిశా
ఇప్పుడు మరోసారి దిశా పటానీ తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేయగా ఇది క్షణాల్లో అంతర్జాలంలోకి దూసుకెళ్లింది.;
దిశా పటానీ తన అభిమానులను ఎప్పుడూ తనదైన ఫ్యాషన్ సెన్స్ తో ఆశ్చర్యపరుస్తుంది. కెల్విన్ క్లెయిన్ ప్రకటనలలో బోల్డ్ లుక్ లేదా రెడ్ కార్పెట్ ఈవెంట్లలో స్టన్నర్ గా నిలుస్తుంది. పోటీలో ఎదురే లేని స్టన్నింగ్ డ్రెస్సింగ్ స్టైల్‌తో పదికి పది స్కోర్ చేయడం తనకే చెల్లింది. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా - రాశి ఖన్నాతో కలిసి నటించిన `యోధా` ప్రమోషన్స్ లో దిశా కనిపించింది. ఈ సందర్భంగా బోల్డ్ డ్రెస్ లో మరోసారి ఫోజులిచ్చింది. దిశా బ్యాక్‌లెస్ వైట్ గౌన్ వెబ్‌లో సునామీని సృష్టించింది.
ఇప్పుడు మరోసారి దిశా పటానీ తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేయగా ఇది క్షణాల్లో అంతర్జాలంలోకి దూసుకెళ్లింది. ఈసారి బ్లాక్ డ్రెస్ లో దిశా ఎంతో హాట్ గా కనిపించింది. బ్లాక్ టూ పీస్ లో కనిపించిన దిశా సొగసైన శరీరం, భంగిమ ఎక్స్ ప్రెషన్స్ పరంగా అద్భుతంగా కనిపించింది. దిశా అందమైన రూపాన్ని చూసి అభిమానులు మంత్ర ముగ్ధులయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో దూసుకెళుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. `యోధా`కు పాజిటివ్ సమీక్షలు వచ్చాయి. తదుపరి ప్రభాస్ నటిస్తున్న భారీ మల్టీ-స్టారర్ `కల్కి 2898 AD`లో కూడా దిశా కనిపిస్తుంది. ఇప్పటికే విదేశాలలో ప్రభాస్ తో రొమాంటిక్ పాటను చిత్రీకరించినప్పటి ఫోటోల లీకయ్యాయి. ఆన్ లొకేషన్ నుంచి కొన్ని ఫోటోలను దిశా షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఇక బాలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా లక్షలాదిగా సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ని సంపాదించింది. దిశా బాలీవుడ్ తో పాటు, సౌత్ లోను పాపులారిటీ పెంచుకుంటోంది.