కల్కి 2898 ఏడీ... ఆ క్యారెక్టర్ ను ఎందుకు తీసుకున్నట్లు?

ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేసే సినిమా చాలా రోజుల తర్వాత కల్కి రూపంలో వచ్చిందని సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోన్న మాట.

Update: 2024-06-30 09:27 GMT

కల్కి 2898ఏడీ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. భారీ కలెక్షన్స్ ని రాబడుతోంది. ప్రతి రోజు 100+ కోట్లకి తగ్గకుండా ఈ మూవీకి కలెక్షన్స్ వస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట. ఆదివారం కూడా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేసే సినిమా చాలా రోజుల తర్వాత కల్కి రూపంలో వచ్చిందని సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోన్న మాట.

ఇదిలా ఉంటే ఈ మూవీలో భైరవ క్యారెక్టర్ లో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించారు. అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ పాత్రలో నటించారు. దీపికా పదుకునే కూడా కల్కికి జన్మనివ్వబోయే సుమతిగా మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఓవరాల్ గా సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర అంటే దిశా పటాని చేసిందనే కామెంట్స్ వస్తున్నాయి. కేవలం ఆమె రోల్ ఓ రెండు సీన్స్, ఒక పాటకి పరిమితం అయ్యింది.

సినిమాలో దిశాపటాని భైరవను ఇష్టపడే అమ్మాయిగా కనిపించింది. ఆమె క్యారెక్టర్ గ్లామర్ కోసం ఉపయోగించుకున్నట్లు ఉంది తప్ప స్టోరీకి ఎలాంటి లింక్ లేదనే అంటున్నారు. మూడు గంటల సినిమా చూసి థియేటర్స్ నుంచి బయటకొచ్చే ప్రేక్షకులలో ఎవరికి దిశాపటాని గుర్తుండదని.. చివరిగా చిన్న రోల్స్ చేసిన రాజేంద్రప్రసాద్, శోభన పాత్రలు కూడా గుర్తుంటాయని.. అలాగే అశ్వద్ధామతో పాటు ఉన్న చిన్న పిల్లాడి క్యారెక్టర్ కి కూడా కథలో ప్రాధాన్యత ఉందని అంటున్నారు.

దిశాపటానికి ఈ మూవీ ఏ విధంగా ప్లస్ కాలేదనే మాట బిటౌన్ లో కూడా వినిపిస్తోంది. అసలు ఈ చిత్రంలో ఆమె ఎందుకు నటించింది అనేది కూడా క్లారిటీ లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కల్కి పార్ట్ 2లో దిశాపటాని క్యారెక్టర్ కి ఏమైనా ప్రాధాన్యత పెరుగుతుందేమో అనేది తెలియాల్సి ఉంది. కల్కి మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో 2వ పార్ట్ మీద ఎగ్జైట్మెంట్ పెరిగింది.

ఇప్పటికే పార్ట్ 2 షూటింగ్ 60 శాతం కంప్లీట్ అయ్యిందంట. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వొచ్చనే మాట వినిపిస్తోంది. అలాగే మూవీలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దులా టక్కరటక్క సాంగ్ లో కనిపిస్తుంది. ఆమె కూడా ఇలా వచ్చి అలా మాయమవుతుంది.

Tags:    

Similar News