బ్లాక్ డ్రెస్ లో దివి స్టన్నింగ్ లుక్

సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి తన ఆట తీరుతోపాటు అందం, అభినయంతోను యూత్ ని బాగా ఆకట్టుకుంది.

Update: 2023-12-19 04:12 GMT

బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన దివి బిగ్ బాస్ తో ఒక్కసారిగా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్న దివికి ఒక్కసారిగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చింది. సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి తన ఆట తీరుతోపాటు అందం, అభినయంతోను యూత్ ని బాగా ఆకట్టుకుంది.


హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు అందుకుని సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఓవైపు వెబ్ సిరీస్ లు, మరోవైపు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. రీసెంట్ టైమ్స్ లో తెలుగమ్మాయిల్లో దివి పేరు బాగా వినిపిస్తోంది. ఈమధ్య సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ హాట్ బ్యూటీ లేటెస్ట్ ఫోటోషూట్లు అంతర్జాలంలో హాట్ టాపిక్ అవుతున్నాయి.


ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన హాట్ హాట్ ఫోటో షూట్లను షేర్ చేయడంతో అవి కాస్త సోషల్ మీడియా అంతట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దివి తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో డిఫరెంట్ ఫోజులిస్తూ మరోసారి ఆకర్షించే ప్రయత్నం చేసింది. బ్లాక్ డ్రెస్ లో మెరుస్తూ క్యూట్ స్మైల్ తో దివి దిగిన ఈ ఫోటోలను చూసి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. బ్లాక్ డ్రెస్ లో దివి అదిరిపోయిందని, దివి టూ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


అంతేకాకుండా ఈమె లేటెస్ట్ ఫోటోలను చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ షేర్ చేస్తున్నారు. ఇక 2017 లో మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన దివి పలు ఫ్యాషన్ షో ల కోసం ర్యాంప్ వాక్ చేసింది. ఆ తర్వాత 2018 లో 'లెట్స్ గో' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు 'మహర్షి' మూవీలో కనిపించింది.


బిగ్ బాస్ సీజన్ 4 తో మరింత క్రేజ్ తెచ్చుకున్న దివి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీ లో ఓ కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలో సునీల్ భార్యగా మంచి నటనను కనబరిచింది. ఈ సినిమాతో పాటూ లంబసింగి, ఏటీఎం అనే సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

Tags:    

Similar News