దివి.. అది నడుమా? హరి విల్లా?

తాజాగా బీచ్ లో యోగా చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది ఈ అమ్మడు. మార్నింగ్ సూర్యుడు ఉదయించే టైంలో యోగాసనాలు వేసిన ఫొటోలను పంచుకుంది.

Update: 2024-02-03 15:40 GMT

బాలీవుడ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని గ్లామర్ దివి సొంతం. అయితే ఆమెకు కాలం కలిసి రాలేదని చెప్పొచ్చు. స్టార్ హీరోయిన్ అయ్యే రేంజ్ లో ఒక్క హిట్ కూడా పడలేదు. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చినా.. దివికి చిన్నా చితకా ఆఫర్స్ మాత్రమే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన దివి.. స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది.

ఓవైపు తనకు వచ్చిన అవకాశాలు వదులుకోకుండా చేస్తూనే.. సోషల్ మీడియా వేదికగా అందాలతో ఆకట్టుకుంటుంది. దర్శక నిర్మాతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఓ రేంజ్ లో పోజులు ఇస్తూ కుర్రాళ్ల మతులు పోగుడుతుంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటోంది.

తాజాగా బీచ్ లో యోగా చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది ఈ అమ్మడు. మార్నింగ్ సూర్యుడు ఉదయించే టైంలో యోగాసనాలు వేసిన ఫొటోలను పంచుకుంది. టైట్ ఫిట్ స్పోర్ట్స్ వేర్ లో నడుమును హరి విల్లులా వంచి చేసిన ఆసనం అయితే వేరే లెవల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యోగా కూడా ఇంత అందంగా ఉంటుందా అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మహేశ్ బాబు- వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన మహర్షి చిత్రంలో కాలేజీ స్టూడెంట్ పాత్రలో మెరిసింది దివి. ఆ తర్వాత బిగ్ బాస్ ఆఫర్ దక్కించుకుంది. అయితే హౌస్ లో కాంట్రవర్సీలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. అమ్మ రాజశేఖర్ తో స్నేహం చేసింది. కొన్ని వారాలకే ఎలిమినేట్ అయినా.. షో వల్ల మంచి గుర్తింపు సంపాదించుకుంది.

గతేడాది రుద్రాంగి మూవీలో కీలక పాత్రలో నటించింది దివి. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మంచు విష్ణు జిన్నాలో హీరో చిన్నప్పటి ఫ్రెండ్ అయిన మూగ అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం దివి.. పుష్ప 2లో జర్నలిస్ట్ రోల్ చేస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీలో కొంచెం స్క్రీన్ స్పేస్ ఉన్న రోల్ ఆమెకు దక్కినట్లు తెలుస్తోంది. పుష్ప 2తో దివికి బ్రేక్ రావొచ్చని ఫ్యాన్స్ అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News