విడాకులు కాదు అమ్మా నాన్న కోసం...!

కొందరు విడాకులు తీసుకోకుండానే విడాకులు తీసుకున్నారు అనే ప్రచారం మొదలు పెడుతున్నారు.

Update: 2023-12-27 12:05 GMT

ఈ మధ్య కాలంలో స్టార్‌ కపుల్స్ విడాకుల వార్తలు కామన్‌ అయ్యాయి. ఎంతో మంది బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ కు చెందిన వారు విడాకులు తీసుకోవడంతో, అందుకు సంబంధించిన వార్తలు మనం చూడటం జరుగుతూనే ఉంది. కొందరు విడాకులు తీసుకోకుండానే విడాకులు తీసుకున్నారు అనే ప్రచారం మొదలు పెడుతున్నారు.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక జంటకు సంబంధించిన బ్రేకప్ ఇష్యూ ట్రెండ్‌ అవుతూనే ఉంది. మొన్నటి వరకు ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ లు విడిపోయేందుకు రెడీ అవుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య దూరం చాలా పెరిగిందనే పుకార్లు షికార్లు చేశాయి. వాటికి క్లారిటీ రాలేదు.

తాజాగా తమిళ స్టార్‌ నటుడు సూర్య మరియు ఆయన భార్య జ్యోతిక విడాకులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం గత కొన్నాళ్లుగా జ్యోతిక ముంబైలో మకాం వేసింది. సూర్య ను వదిలి ఆమె ముంబై వెళ్లడం వల్లే విడాకుల వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇలాంటి సమయంలో జ్యోతిక విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సూర్య చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ప్రస్తుతం ముంబైలో ఉంటున్న మాట వాస్తవం. మా అమ్మా నాన్న ముంబైలో ఉంటారు. వారికి ఈ వయసులో నా అవసరం ఉంది. అందుకే నేను ముంబైలో ఉంటున్నాను.

అమ్మా నాన్నల కోసం ముంబైలో ఉంటున్నాను.. అంతే తప్ప సూర్య నుంచి విడి పోలేదు అంటూ జ్యోతిక క్లారిటీ ఇచ్చింది. జ్యోతిక రియాక్షన్‌ పై కూడా పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సూర్య కు కూడా మీ అవసరం ఉంటుంది, పిల్లలకు మీ అవసరం ఉంటుంది. మరి ఎందుకు ఇప్పుడు వారి కోసం చెన్నై లో లేరు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సూర్య, జ్యోతిక విడాకుల వార్తలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News