ఆలియా 'తప్పుడు కలెక్షన్స్' అంటూ తిట్టేసిన నటి
దివ్య శనివారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆలియాను ఒక రేంజులో తిట్టారు.
యానిమల్ సహా పలు సౌతిండియా బ్లాక్ బస్టర్లను నిర్మించిన టీసిరీస్ భూషణ్ కుమార్ భార్య, ప్రముఖ కథానాయిక దివ్య ఖోస్లా కుమార్ ఇటీవల రకరకాల కారణాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో తన సహనటి ఆలియా భట్ నటించిన తాజా చిత్రం `జిగ్రా`పై దివ్య ఖోస్లా తీవ్రమైన ఎటాక్ చేసారు. ఈ మూవీ కోసం బాక్సాఫీస్ నంబర్‌లను తారుమారు చేసిందని ఆరోపిస్తూ అలియా భట్‌పై దివ్య ఖోస్లా తీవ్ర దాడి చేసింది. అలియా తన సొంత సినిమా టిక్కెట్లు కొనుగోలు చేసి, ప్రజలను మోసం చేయడానికి `నకిలీ కలెక్షన్`లను ప్రకటించిందని దివ్య ఆరోపించింది
దివ్య శనివారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆలియాను ఒక రేంజులో తిట్టారు. ఖాళీగా ఉన్న థియేటర్ ఫోటోని కూడా షేర్ చేసిన దివ్య ఖోస్లా జిగ్రా పనితనంపై తీవ్రంగా విమర్శించింది. తన ఇన్ స్టా పోస్ట్‌లో దివ్య ఇలా రాసారు. ``జిగ్రా షో కోసం సిటీ మాల్ పివిఆర్‌కి వెళ్లాను. థియేటర్ పూర్తిగా ఖాళీగా ఉంది... అన్ని చోట్లా అన్ని థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. మనం ఆడియెన్ ని ఫూల్స్ ని చేయలేము. నిజాన్ని అబద్ధం దాచలేదు. హ్యాపీ దసరా`` అని వ్యాఖ్యలను జోడించారు. అలాగే పెయిడ్ మీడియా ఎందుకు ఈ బాక్సాఫీస్ నంబర్లను ప్రకటించిందో! అంటూ దివ్య సూటిగా విమర్శించారు.
ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం.. వాసన్ బాలా తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజు భారతదేశంలో రూ. 4.55 కోట్లను రాబట్టింది. #జిగ్రా ఊహించిన దానికంటే తక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలైంది. పట్టణ కేంద్రాల నుండి మంచి వసూళ్లు వచ్చాయని రాసారు. డేవన్ వసూళ్లకు సహకరించిన ఆలియా స్టార్-పవర్ కి ధన్యవాదాలు అని అతడు రాసాడు. ఊహించినట్లుగానే మాస్ పాకెట్స్ నుండి స్పందన సాధారణం/మోస్తంగా ఉంది. #హిందీ హార్ట్‌ల్యాండ్‌లో శక్తివంతమైన ప్రారంభమిది. ప్రారంభ రోజు పనితీరును బలపరిచింది. ముందుచూపుతో దసరా సెలవుదినం ప్రారంభ లోటును భర్తీ చేయడంలో సహాయపడుతుంది... ఆదివారం కూడా సంఖ్యలకు చాలా అవసరమైన బూస్ట్‌ను అందించగలదని భావిస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా పట్టణ కేంద్రాలలో ఈ చిత్రం ఎంతవరకు నిలదొక్కుకుంటుందో సోమవారం స్పష్టత వస్తుంది. డే1 శుక్రవారం - రూ. 4.55 కోట్ల నెట్ #ఇండియా బిజ్`` అని రాశారు.
జిగ్రా చిత్రం రాజ్‌కుమార్ రావు, ట్రిప్తీ డిమ్రీ నటించిన `విక్కీ విద్యా కా వో వాలా వీడియో`తో బాక్సాఫీస్ ఘర్షణను ఎదుర్కొంది. అది అలియా చిత్రం కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. `విక్కీ విద్యా కా వో వాలా వీడియో` రూ. 5.71 వసూలు చేసింది. శుక్రవారం నాడు విడుదైన `జిగ్రా` చిత్రంతో పోలిస్తే ఆలియా నటించిన 2014 హైవే ఉత్తమ ఓపెనింగ్ వసూళ్లను అందించింది.
`జిగ్రా` తన సోదరుడిని రక్షించడానికి ఒక భయంకరమైన సాహసానికి పూనుకునే అక్క కథతో తెరకెక్కింది. ఫూలోన్ కా తారో కా అనే క్లాసిక్ సాంగ్ కూడా టీజర్‌లో చేర్చారు. ఇందులో వేదంగ్ రైనా గాత్ర ప్రతిభ ఆకట్టుకుంటుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మించింది. వయాకామ్ 18 స్టూడియోస్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ సమర్పణలో `జిగ్రా` తెరకెక్కగా, దేబాశిష్ ఇరెంగ్ బామ్- వాసన్ కలిసి స్క్రీన్ ప్లేను అందించారు.