పిక్ టాక్ : అందాల సీతాకొక చిలుక

ఎన్నో కమర్షియల్‌ యాడ్ ఫిల్మ్స్ కు దర్శకత్వం వహించి మెప్పించిన దివ్య ఖోస్లా ఇప్పుడు సినిమాల మేకింగ్‌ పై దృష్టి పెట్టింది

Update: 2024-06-21 05:58 GMT
పిక్ టాక్ : అందాల సీతాకొక చిలుక
  • whatsapp icon

నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా బాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితం అయిన దివ్య ఖోస్లా కుమార్‌ సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు నెట్టింట వైరల్‌ అయ్యింది.

ఎన్నో కమర్షియల్‌ యాడ్ ఫిల్మ్స్ కు దర్శకత్వం వహించి మెప్పించిన దివ్య ఖోస్లా ఇప్పుడు సినిమాల మేకింగ్‌ పై దృష్టి పెట్టింది. ప్రముఖ మ్యూజిక్‌ లేబుల్‌ మరియు నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ అధినేత అయిన భూషన్ కుమార్‌ ని వివాహం చేసుకున్న తర్వాత దివ్య మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.

నెట్టింట ఈమె రెగ్యులర్‌ గా అందాల ఫోటోలతో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ప్రముఖ మ్యాగజైన్ కవర్‌ పై కనిపించింది. ఈసారి సీతాకొక చిలుక లుక్ లో, విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ లో కన్నుల విందు చేసింది. ఆకట్టుకునే అందం తన సొంతం అంటూ మరోసారి నిరూపితం చేసింది.

నిర్మాతగా దర్శకురాలిగా కొనసాగడం కంటే హీరోయిన్‌ గా ఈమె చేయడం మంచిదనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి రోజు రోజుకు భారీగా ఫాలోయింగ్‌ పెరుగుతూ ఉంది. ఈ ఫోటోలతో ఆమె ఫాలోయింగ్‌ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News