నాగ్ అశ్విన్ నా క్యారెక్టర్ ని చంపేశాడు

కల్కి 2898ఏడీ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ కి క్రాస్ చేసింది. రికార్డ్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.

Update: 2024-07-19 06:15 GMT

కల్కి 2898ఏడీ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ కి క్రాస్ చేసింది. రికార్డ్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఇతర విదేశీ భాషలలో కల్కి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సౌత్ ఇండియాలో నాన్ బాహుబలి 2 మూవీ రికార్డులని ఇప్పటికే కల్కి2898ఏడీ బ్రేక్ చేసింది. ఇండియన్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి థ్రిల్ చేసింది. విజువల్ స్పెక్టక్యులర్ గా ఈ సినిమా ఉందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులకి బాగా రీచ్ కావడంలో సక్సెస్ అయ్యింది. ఈ కారణంగా వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయి వసూళ్లు కల్కి చిత్రానికి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ కెమెరామెన్ గా వర్క్ చేశారు. ఈయన అందించిన విజువలైజేషన్ కూడా ప్రేక్షకులకి కొత్త అనుభూతి కలిగించింది.

తాజాగా ఆయన ఇంటర్వ్యూలో కల్కి 2898ఏడీ మూవీ షూటింగ్ అనుభవాలు పంచుకున్నారు. నాగ్ అశ్విన్ కి ఈ సినిమా షూటింగ్ విషయంలో కావాల్సిన పూర్తి సహకారం నిర్మాతల నుంచి వచ్చిందని జోర్డ్జే తెలిపారు. బెస్ట్ టెక్నీకల్ ఈక్వీప్మెంట్స్ ని ప్రొడక్షన్ హౌస్ ప్రొవైడ్ చేసిందని అన్నారు. అందుకే ఈ రోజు తెరపై కల్కి మూవీ అంత బెస్ట్ క్వాలిటీతో కనిపిస్తుందని తెలిపారు. నాగ్ అశ్విన్ కూడా తనకి కావాల్సిన అవుట్ ఫుట్ వచ్చేవరకు ఓపికతో చేయిస్తూనే ఉంటారని తెలియజేశారు.

ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఇంత అద్భుతమైన ఆదరణ మూవీకి వస్తుందంటే దానికి నాగ్ అశ్విన్ విజువల్ ఇమాజినేషన్ కారణమని అన్నారు. అయితే ఈ చిత్రంలో నాగ్ అశ్విన్ నాకు ఎయిర్ ఫైటర్ గా ఒక క్యారెక్టర్ ఇచ్చారని, కానీ నా రోల్ లో వెంటనే చంపేశాడని జోర్డ్జే సరదాగా అన్నారు. ఈ ఒక్క విషయంలో నేను చాలా డిజప్పాయింట్ అయ్యానని తెలిపారు. ఫన్నీగానే జోర్డ్జే తన అభిప్రాయాన్ని సరదాగా ఇలా తెలియజేశారు.

సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ నుంచి ప్రతి ఒక్కరు తమ అనుభవాలని ఇంటర్వ్యూల ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్ మాట్లాడుకుంటున్న వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక జోర్డ్జే సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమా కల్కినే కావడం విశేషం.

Tags:    

Similar News